విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాస‌న‌స‌భ‌లో జ‌గ‌న్ సంచ‌ల‌నం: టీడీపీ ఎమ్మెల్యేలు నాతో ట‌చ్‌లో ఉన్నారు: టీడీపీలో క‌ల‌క‌లం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీడీపీ MLAలు నాతో ట‌చ్‌లో ఉన్నారు : జ‌గ‌న్ || Oneindia Telugu

ఏపీ శాస‌న‌స‌భా వేదిక‌గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. తొలి శాస‌న‌స‌భా సమావేశాల రెండో రోజునే టీడీపీ ల‌క్ష్యంగా వైసీపీ వ్య‌వ‌హ‌రించింది. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు సైతం తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేసారు. ఏపీ శాస‌న‌స‌భా స్పీక‌ర్‌గా తమ్మినేని సీతారాం ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం స్పీక‌ర్‌ను అభినందిస్తూ ఎమ్మెల్యేలు మాట్లాడే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి మొద‌లు ప్ర‌తిప‌క్ష నేత వ‌ర‌కూ అంద‌రూ రాజ‌కీయాల వైపు మ‌ళ్లారు. ఇందులో భాగంగానే..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు టీడీపీలో క‌ల‌క‌లం మొద‌లైంది.

వైసీపీ ట్రాప్‌..టీడీపీ దొరికిపోయింది : జ‌గ‌న్ డిసైడ్ అయిపోయారు: స‌భ‌లో ర‌ంజైన రాజ‌కీయం..! వైసీపీ ట్రాప్‌..టీడీపీ దొరికిపోయింది : జ‌గ‌న్ డిసైడ్ అయిపోయారు: స‌భ‌లో ర‌ంజైన రాజ‌కీయం..!

టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నారు..

టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నారు..

ఏపీ శాస‌న‌స‌భ‌లో రెండో రోజే అధికార - ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు..ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దిగారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాం లో జ‌రిగిన ఫిరాయింపులు..నాటి అధికార పార్టీ వాటిని ప్రోత్స‌హించిన తీరు..స్పీక‌ర్ వ్య‌వ‌హ‌రించిన విధానం పైన సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌గా ప్ర‌స్తావించారు. గ‌త ముఖ్య‌మంత్రి చేసిన విధంగా తాను చేయ‌న‌ని చెబుతూనే.. ఎవ‌రైనా త‌మ వ‌ద్ద‌కు రావాల‌ని భావిస్తే..ఖ‌చ్చితంగా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు. టీడీపీ నుండి 23 మంది ఎమ్మ‌ల్యేలు గెలిచార‌ని..వారిలో ఆరుగురో..ఏడుగురిని మ‌న వైపు తీసుకుందామ‌ని చాలామంది చెప్పార‌ని కానీ తాను మాత్రం ఒప్పుకోలేద‌న్నారు. తాను డోర్లు ఓపెన్ చేస్తే...టీడీపీ నుండి ఎంత‌మంది రావ‌టానికి సిద్దంగా ఉన్నా రో..త‌న‌తో ఎంత మంది ట‌చ్‌లో ఉన్నారో నా నోటితో చెప్ప‌టం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌తో టీడీపీలోనే కాదు..అధికార పార్టీలోనూ చ‌ర్చ మొద‌లైంది.

నాడు వైయ‌స్ చేసిందేంటి..

నాడు వైయ‌స్ చేసిందేంటి..

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు స‌మాధానంగా ప్ర‌తిప‌క్ష నేత సైతం స్పందించారు. ప్ర‌తిప‌క్షాన్ని కించ‌ప‌రిచేలా ప్ర‌తీ స‌భ్యుడు మాట్లా డుతున్నారంటూ చంద్ర‌బాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. 1978లో వైయ‌స్సార్ రెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచిన త‌రువాత నాలుగు రోజుల‌కే కాంగ్రెస్‌లోకి వ‌చ్చార‌ని గుర్తు చేసారు. చ‌రిత్ర మార్చ‌లేరు..ముఖ్య‌మంత్రి తొలి ప్ర‌సంగంలోనే ఇలా మాట్లాడ‌టం స‌రి కాద‌న్నారు. దీనికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం స్పందించారు. మీరు ఏం చేసారో చెప్ప‌కుండా.. అవా స్త‌వాలు చెప్పి..నా కంటే ముందు ఎవ‌రో హ‌త్య చేసారు..నేను అదే చేస్తా అనే విధంగా చంద్ర బాబు మాట్లాడుతున్నార ని సీఎం ఫైర్ అయ్యారు. ఆ సంద‌ర్భంలో టీడీపీకి ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేయాల‌ని తాన‌కు లేద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. చంద్ర‌బాబు ఎప్పటికీ ప్ర‌తిప‌క్ష నేత‌గానే ఉండాల‌ని..ఆయ‌న అక్క‌డే ఉంటూ ప్ర‌భుత్వ పాల‌న చూడాల‌ని జ‌గ‌న్ ఆకాంక్షించారు.

టీడీపీలో చ‌ర్చ మొద‌లు...

టీడీపీలో చ‌ర్చ మొద‌లు...

శాస‌న‌స‌భా వేదిక‌గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌తో టీడీపీ నుండి ఎంత‌మంది ట‌చ్‌లో ఉన్నారో చెప్ప‌నా..అంటూ చేసిన వ్యాఖ్య‌ల మీద చ‌ర్చ మొద‌లైంది. ఇది..చ‌ర్చ‌లో భాగంగా జ‌గ‌న్ యాధృచ్చికంగా అన్నారా..లేక నిజంగా జ‌రుగుతున్న విష‌యాన్నే ప్ర‌స్తావించారా అనే దాని పైన ఎవ‌రి అంచ‌నాల్లో వారున్నారు. జ‌గ‌న్ స‌భ‌లో ఈ వ్యాఖ్య‌ల‌ను చేసిన స‌మ యంలో మాత్రం టీడీపీ అధినేత చంద్ర‌బాబు న‌వ్వుతూ క‌నిపించారు. అయితే, కొద్ది రోజులుగా మాత్రం టీడీపీ నుండి గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇప్పుడు నేరుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏకంగా శాస‌న‌స‌భ‌లోనే ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఇప్పుడు ఎన్నిక‌లు ముగి సిన నెల రోజుల్లోనే మ‌రో కొత్త రాజ‌కీయ చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. రానున్న రోజుల్లో ఇది ఎటువైపు ట‌ర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.

English summary
AP CM Jagan sensational comments in Assembly. He stated that TDP MLA's touch with him..but he do not want to tell number. Jagan says defections will not take place in this govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X