విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవి తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా ? సీఎం జగన్ సవాల్

|
Google Oneindia TeluguNews

ఎక్సైజ్ సవరణ చట్టంపై ఏపీ అసెంబ్లీలో చర్చ వాడివేడిగా కొనసాగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లింది. మద్యం షాపులను తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట తప్పిందని, అంతేకాకుండా రాష్ట్రంలో నాటు సారా అమ్మకాలు ఎక్కువయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు.ప్రభుత్వం చెబుతున్నదానికి విరుద్ధంగా రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య పెరిగిందని ఆరోపించారు.

 300 కీలక పదవులన్నీ సొంత సామాజిక వర్గానికే .. జగన్ నినాదం వంచనే : యనమల 300 కీలక పదవులన్నీ సొంత సామాజిక వర్గానికే .. జగన్ నినాదం వంచనే : యనమల

అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ ఫైర్

అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ ఫైర్


ఇక అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసిపి అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుసభను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

మద్యం పాలసీపై అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలన్నీ తప్పన్న సీఎం జగన్

మద్యం పాలసీపై అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలన్నీ తప్పన్న సీఎం జగన్

చంద్రబాబు హయాంలో గ్రామాల్లో మద్యం ఏరులై పారింది అని ఆయన మండిపడ్డారు. మద్యం పాలసీపై అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలన్నీ తప్పని అన్నారు. చంద్రబాబు హయాంలో 4380 మద్యం షాపులు ఉంటే తాము అధికారంలోకి వచ్చాక 25శాతం మద్యం షాపుల్ని తగ్గించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,456 మద్యం షాపులున్నాయని సీఎం వివరించారు. 4వేల బెల్ట్ షాపులను ఎత్తివేశామని తెలిపారు. నవంబర్‌ నాటికి రాష్ట్రంలో మద్యం వినియోగం 23.63 శాతానికి తగ్గిందని సీఎం చెప్పుకొచ్చారు.

ఆ లెక్కలు తప్పని తేలితే రాజీనామా చేస్తారా అంటూ మండిపాటు

ఆ లెక్కలు తప్పని తేలితే రాజీనామా చేస్తారా అంటూ మండిపాటు

సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలన్నీ తప్పన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి అచ్చెన్నాయుడు కు సవాల్ విసిరారు. మద్యం పాలసీపై అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలన్నీ తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. టీడీపీ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అచ్చెన్నాయుడుకి సభాహక్కుల నోటీసును ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

మద్య నియంత్రణ కోసం కఠిననిబంధనలు

మద్య నియంత్రణ కోసం కఠిననిబంధనలు

మద్యం అమ్మకాలను నియంత్రించడం కోసమే కఠినతరమైన నిబంధనలు పెట్టామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తే బార్ లైసెన్స్ సైతం క్యాన్సిల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.ఇక సభలో టీడీపీపై విరుచుకుపడిన ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

English summary
YCP chief, AP CM YS Jaganmohan Reddy reacted sharply to the comments made by Achcheannayadu. Chief Minister YS Jaganmohan Reddy has expressed outrage that the TDP leaders. He said in the assembly on Monday .. TDP MLA Achchennayudu lying in the assembly .Reacting to Chandrababu Naidu's claim that the Andhra Pradesh government has not brought down liquor sales, Chief Minister on Monday said that the state's liquor sales have declined by 34.84 per cent under the present dispensation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X