విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లీజులో స్వర్ణ ప్యాలెస్ హోటల్: కోవిడ్ ఆసుపత్రిగా: ప్రమాదంపై జగన్ ఆరా: వేటు పడుతుందా?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు ఆదేశించారు. తక్షణ చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని చెప్పారు.

Recommended Video

Vijayawada Covid Hospital : విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై స్పందించిన CM జగన్..కీలక ఆదేశాలు జారీ !

విజయవాడకు చెందిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చినట్లు అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరించినట్లు తెలుస్తోంది. లీజుకు తీసుకున్న హోటల్‌లో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

AP CM YS Jagan inquired about the Swarna Palace hotel Covid Centre Fire Accident

ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఈ ఘటనపై ఇఫ్పటికే విజయవాడకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని ఆయన అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. లీజుకు తీసుకున్న హోటల్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం అనుమతులను తీసుకుందా? లేదా? అనే విషయంపై ఆరా తీయాలని అన్నారు.

విజయవాడ: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుమంది మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. 30 మంది కరోనా వైరస్ పేషెంట్లను ఇతర కోవిడ్ సెంటర్‌లో చేర్చారు. ఈ ఘటన పట్ల విజయవాడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy inquired about the Fire accident in Swarna Palace Hotel Covid Care Centre at Vijayawada on Sunday. He was asked the officials to comprehensive report on the fire accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X