విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారులకు భోగిపళ్లు పోసి .. ఎడ్ల పందాలు చూసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP CM YS Jagan Reaches Gudiwada To Watch Sankranthi Festival Celebrations

ఏపీలో ఒకపక్క రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళనలను చేస్తుంటే మరోపక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడి చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు .పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నానీ గుడివాడలో సంక్రాంతి వేడుకలుఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న ఎడ్ల పందాలు నిర్వహించిన నానీ నేడు సీఎం జగన్ ను ఆహ్వానించి సంక్రాంతి సంబరాలు జరిపారు.

లింగవరం రోడ్‌ కే కన్వెన్షన్‌లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగాజరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌.. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. అలాగే ఆ ప్రాంగణంలో చాలా బాగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరితో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇక అక్కడ ఎడ్ల పందాలను తిలకించారు జగన్ మోహన్ రెడ్డి . ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శనను ఆయన మంత్రి కొడాలి నానీతో కలిసి తిలకించారు.

AP CM YS Jagan mohan reddy participated Sankranti celebrations in Gudivada

ఇక మరో వైపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను సీఎంగా తొలిసారి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని తాను కోర్కున్తున్నట్టు చెప్పారు జగన్ మోహన్ రెడ్డి . పైరు పచ్చలతో కళకళలాడుతూ రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.

English summary
At the Lingavaram Road K Convention, ycp celebrated sankranthi . CM YS Jagan, who participated in the celebrations .. The little girls were blessed with the bhogi pallu . jagan have seen the arranged toy collection. CM YS Jagan along with ministers Kodali Nani and others participated in the celebrations. They watched bull fight .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X