విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు ఆభరణాలు: విలువెంతో తెలుసా?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: చంద్రబాబు హయాంలో కూల్చివేతలకు గురైన దేవాలయాలను పునర్నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలయాల పునర్నిర్మారణం, జీర్ణోద్ధారణ కోసం ముహూర్తాన్ని కూడా నిర్ధారించింది. శుక్రవారమే పునర్నిర్మాణ పనులకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం విజయవాడలో కూల్చి వేసిన తొమ్మిది దేవాలయాలను పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం సరిగ్గా 11.01 నిమిషాలకు శనైశ్చర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో ఆయన శిలాఫలకాలను ఆవిష్కరించారు.

చేతకాకపోతే ఆ పని చేయండి: కావాలంటే ప్రజంటేషన్ ఇస్తా: జగన్ సర్కార్‌కు సీబీఐ మాజీ చీఫ్ సలహాచేతకాకపోతే ఆ పని చేయండి: కావాలంటే ప్రజంటేషన్ ఇస్తా: జగన్ సర్కార్‌కు సీబీఐ మాజీ చీఫ్ సలహా

అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి బంగారు ఆభరణాలను అందజేస్తారు. దీని విలువ ఆరున్నర లక్షల రూపాయలు. ఆరున్నర లక్షల రూపాయల వ్యయంతో కనక దుర్గ‌మ్మ‌ అమ్మవారికి మూడు ఆభరణాలను దేవాదాయ మంత్రిత్వ శాఖ అధికారులు చేయించారు. వజ్రలు పొదిగిన ముక్కుపుడక, బొట్టు, బులా‌కీ ఇందులో ఉన్నాయి. వాటి బరువు సుమారు 28.380 గ్రాములు. వజ్రలు పొదిగిన ముక్కుపుడక (నత్తు) బొట్టు, బులా‌కీని కానుక‌గా అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు.

AP CM YS Jagan presents Rs 6.5 lakhs gold ornaments to Goddess Kanaka Durga

రాష్ట్రంలో దేవాలయాలు, దేవతా విగ్రహాలపై వరుస దాడులు కొనసాగుతోన్న నేపథ్యంలో.. జగన్ సర్కార్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు హయాంలో కూల్చివేతలకు గురైన తొమ్మిది ఆలయాలను పున్నిర్మించడానికి పూనుకుంది.

AP CM YS Jagan presents Rs 6.5 lakhs gold ornaments to Goddess Kanaka Durga

నిర్మాణ పనులకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ జాబితాలో రాహు-కేతు ఆలయం, సీతమ్మ పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, శనైశ్చర ఆలయం, బొడ్డు బొమ్మ, దుర్గగుడి మెట్ల వద్ద మరో ఆంజనేయస్వామి ఆలయం, సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం, వీరబాహు ఆలయం, శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాలను పునర్నిర్మించనున్నారు.

English summary
AP government headed by Chief Minister YS Jagan Mohan Reddy presents Rs 6.5 lakhs gold ornaments to Goddess Kanaka Durga at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X