విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో స్కూల్స్ రీ ఓపెనింగ్ పై మరోసారి జగన్ క్లారిటీ.. ఇక ఇదే ఫైనల్...

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువవుతోంది. పిల్లలను స్కూళ్లకు పంపించే పరిస్దితి లేదు. అయితే త్వరలోనే పరిస్ధితులు అదుపులోకి వస్తాయని భావిస్తున్న ప్రభుత్వం పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో పరిస్ధితిని అంచనా వేసిన అధికారులు సీఎం జగన్ కు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా పాఠశాలల పునఃప్రారంభ తేదీని జగన్ ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఇవాళ జరిగిన నాడు-నేడు సమీక్షా సమావేశంలో అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చారు.

జగన్ కు రఘురామ కొత్త ఆఫర్- ఒప్పుకుంటే 10 రోజుల్లో జనంలోకి - వైసీపీలోనే ఉంటానంటూ..జగన్ కు రఘురామ కొత్త ఆఫర్- ఒప్పుకుంటే 10 రోజుల్లో జనంలోకి - వైసీపీలోనే ఉంటానంటూ..

ఆగస్టు చివరి నాటికి కరోనా వైరస్ అధుపులోకి వస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలను పునః ప్రారంబించేందుకు సిద్దమవుతోంది. ఇదే విషయాన్ని అధికారులకు మరోసారి తెలియజేసిన సీఎం జగన్..

ap cm ys jagans confirm schools re opening on september 5

Recommended Video

Sonu Sood Help to AP Farmer With Tractor

ఈ మేరకు నాడు-నేడు కింద స్కూళ్ల సుందరీకరణ కోసం చేస్తున్న పనులు పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 31 నాటికి నాడు-నేడు పనులు పూర్తి చేసి విద్యాసంస్ధలు తెరిచేందుకు అనువైన వాతావరణం సిద్దం చేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే నాడు-నేడు తొలి విడతలో భాగంగా పలు పాఠశాలలను సిద్దం చేసిన అధికారులు.. మిగతా వాటిని నెల రోజుల్లో పూర్తి చేసి స్కూళ్లు తెరిచే నాటికి అన్నీ సిద్ధంగా ఉంచాలని భావిస్తున్నారు.

English summary
andhra pradesh chief minister ys jagan on tuesday re confirmed that state schools will be re opened on september 5th. jagan orders officials to make arrangements for the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X