విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

12 శాతం వడ్డీ ఎవరడిగారు?: మాకొద్దు: హైకోర్టు తీర్పుతో జనంలో చిన్నచూపు: బాధ్యత లేదా?: ఉద్యోగులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వం కోతపెట్టిన వేతనాలను 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలన్న ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. 12 శాతం వడ్డీతో కూడిన జీతాన్ని తాము ఎప్పుడూ కోరలేదని పేర్కొంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. 12 శాతం వడ్డీతో వేతనాలను చెల్లించాలని కోరుతూ తాము ఎవ్వరికీ కోర్టుకు వెళ్లే అధికారాన్ని ఇవ్వలేదని పేర్కొంది.

12 శాతం వడ్డీతో కలిపి..

12 శాతం వడ్డీతో కలిపి..

ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కే వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన మార్చి, ఏప్రిల్ నెలల వేతనాల్లో 50 శాతం మేర కోత పెట్టిన విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్‌ నెలల వేతనం, పెన్షన్‌లో కోత పెట్టడంపై ఓ రిటైర్డ్ న్యాయమంత్రిత్వ శాఖ ఉద్యోగిని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌‌ను దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగులందరికీ 12 శాతం వడ్డీతో కలిపి వేతనాన్నిచెల్లించాలంటూ ఆదేశించింది.

ఉద్యోగ సంఘాల అభ్యంతరం..

ఉద్యోగ సంఘాల అభ్యంతరం..

దీనిపై వెంకట్రామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే 50శాతం జీతాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి తీర్పును పునఃసమీక్షించాలని కోరతామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు సైతం తమ నెల జీతంలో 11 రోజుల వేతనాన్ని కరోనా సహాయక చర్యల కోసం ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర రెవెన్యూ ఉద్యోగులు కూడా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నారని చెప్పారు.

మాకు సామాజిక బాధ్యత ఉండకూడదా?

మాకు సామాజిక బాధ్యత ఉండకూడదా?

కరోనా సమయంలో తాము పని చేసినా.. చేయకపోయినా ప్రభుత్వం జీతాలను చెల్లిస్తోందని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇబ్బందుల కారణంగా వాయిదా వేసిన వేతనాన్ని 12 శాతం వడ్డీతో కలిపి తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశఆరు. తమకు సామాజిక బాధ్యతలు ఉండవా? అని అన్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో చిన్నచూపు కలిగించేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోత పెట్టిన జీతాన్ని చెల్లించాలంటూ తాము కోరగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.

ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం..

ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం..

కరోనా వల్ల యావత్ దేశం రెండు నెలల పాటు స్పందించిందని, రాష్ట్ర ప్రభుత్వానికి సగటున నెలకు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం 150 నుంచి 200 కోట్ల రూపాయలకు పడిపోయిందని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదాయం పడిపోయింది కాబట్టే ప్రభుత్వ ఇబ్బందులను గుర్తించి, 50 శాతం వాయిదా వేయడానికి అంగీకరించామని అన్నారు. కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. జీతాలు, డీఏలను వాయిదా వేయడమో లేక కోత పెట్టడమో చేశాయని అన్నారు.

అప్పీల్‌కు వెళ్తామంటూ..

అప్పీల్‌కు వెళ్తామంటూ..


ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులతో తమకు సంబంధం లేదని, తమ జీతాలు తమకు రావాల్సిందేనంటూ పట్టుబడితే.. ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఇబ్బందులతో తనకు సంబంధం లేదని, విధులకు హాజరైతేనే వేతనాలను చెల్లిస్తామంటూ పట్టుబడితే.. నష్ట పోయేది తామేనని వెంకట్రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. తమ చేతనైనంత మేరకు ప్రజలకు, ప్రభుత్వానికి తోడ్పడాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. హైకోర్టు తీర్పుపై రివ్యూ కోరుతామని చెప్పారు.

English summary
The Andhra Pradesh Government Employees Federation said that the government employees never demanded the 50 per cent of the salaries that were cut in the months of March and April along with 12 per cent interest. K Venkatarami Reddy, chairman and Arava Paul, secretary general of the federation said in a statement here on Thursday that they would discuss the issue in the committee meeting before preferring appeal in the High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X