విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో ఏపీ సర్కార్-ఐఎస్‌బీ ఒప్పందం- దేశంలో తొలిసారి-కొత్త రాజధానుల్లో పెట్టుబడుల ఆకర్షణ...

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్తగా ఏర్పాటవుతున్న రెండు నూతన రాజధానులు విశాఖపట్నం, కర్నూలుతో పాటు రాయలసీమ ప్రాంతంలో భారీ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు వీలుగా ప్రభుత్వం ఓ కీలక ఒప్పందం చేసుకోబోతోంది. హైదరాబాద్ కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్‌బీతో చేసుకునే ఈ ఒప్పందంతో వెనుక బడిన ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి ఫలాలు, ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

ఏపీ రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం- విశాఖ తరలింపుకు మార్గం సుగమం...ఏపీ రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం- విశాఖ తరలింపుకు మార్గం సుగమం...

ఆగస్టు 5న ఐఎస్‌బీతో ఏపీ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. ఐఎస్‌బీ భాగస్వామ్యంతో ప్రభుత్వం, పాలనతో కీలక సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.

ap government to sign mou with isb to attract investments in new capitals

Recommended Video

Andhra Pradesh : Just Apply For E-pass And Travel To AP Without Clearance || Oneindia Telugu

విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణతోపాటు భారీ పరిశ్రమలు తీసుకురావడం, ఆర్ధిక పరిస్ధితిని చక్కదిద్దడంలో ఐఎస్‌బీ భాగస్వామ్యం పనికొస్తుందని గౌతం రెడ్డి వెల్లడించారు. ఎంఎన్‌సీ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కూడా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా రాష్ట్రాభివృద్ధికి పలు విధాలుగా సహరించేందుకు ఐఎస్‌బీ సిద్దంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

English summary
andhra pradesh government to sign a mou with indian school of business for attracting investments in new capitals visakhaptnam and kurnool. the new mou also aims to bring heavy industries and jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X