విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త‌ండ్రిని మించిన జ‌గ‌న్ ఆరోగ్య‌శ్రీ స్కీం: ప‌్ర‌తీ మండ‌లంలో కుయ్..కుయ్‌: ఏ ఆస్ప‌త్రిలో...ఎక్క‌డైనా..

|
Google Oneindia TeluguNews

వైయ‌స్ పేరు చెప్ప‌గానే గుర్తుకు వ‌చ్చేది ఆరోగ్య‌శ్రీ..ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్. ఇక‌..ఇప్పుడు జ‌గ‌న్ సైతం అదే విధంగా త‌న తండ్రి బాట‌లోనే..ఒక విధంగా త‌న తండ్రి కంటే ఒక అడుగు ముందుకేసీ ఆరోగ్య శ్రీ ప‌ధ‌కానికి రూపం ఇచ్చారు. న‌వ ర‌త్నాల్లో ప్ర‌క‌టించిన విధంగా ప్ర‌తీ ఒక్క‌రికీ ఆరోగ్య శ్రీ అందుబాటులోకి తెచ్చారు. ఏపీ శాస‌న‌స‌భ‌లో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఇప్ప‌టి వ‌రకు తెల్ల రేష‌న్ కార్డు దారుల‌కే ప‌రిమిత‌మైన ఆరోగ్య శ్రీ..ఇక నుండి అయిదు ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ వ‌ర్తిస్తుంది. ప్ర‌తీ మండ‌లంలోనూ 108 అంబులెన్స్‌లు అందుబాటులోకి రాను న్నాయి. వెయ్యి రూపాయాలు దాటితే ఏ ఆస్ప‌త్రిలో అయినా చికిత్స‌కు ఆరోగ్య శ్రీ కింద వెసులుబాటు క‌ల్పించారు.

Recommended Video

రైతుకు భరోసాగా ఏపీ వ్యవసాయ బడ్జెట్
వైయ‌స్ ఆరోగ్య శ్రీ కంటే ధీటుగా...

వైయ‌స్ ఆరోగ్య శ్రీ కంటే ధీటుగా...

దివంగ‌త మ‌ఖ్య‌మంత్రి వైయ‌స్సార్ ఆరోగ్య శ్రీ ప‌ధ‌కం ద్వారా ల‌బ్ది దారుల గుండెల్లో ఇప్ప‌టికీ నిలిచిపోయారు. ఆ త‌రువాత టీడీపీ ప్ర‌భుత్వం అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజీవ్ ఆరోగ్య‌శ్రీని ఎన్టీఆర్ వైద్య సేవ‌లుగా మార్చినా..ఆ స్థాయిలో ఇమేజ్ సంపాదించుకోలేక పోయింది. ఇక‌, ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ త‌న న‌వ‌ర‌త్నాల అమ‌ల్లో భాగంగా ఆరోగ్య‌శ్రీ కి తిరిగి ప్రాణం పోస్తున్నారు. అందులో భాగంగా త‌న తండ్రి వైయ‌స్ హాయంలో తెల్ల రేష‌న్ కార్డు దారుల‌కే అందుబాటులో ఉన్న ఆరోగ్య శ్రీని ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు అందుబాటులోకి తెచ్చారు. అయిదు ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రూ ఈ ప‌ధ‌కానికి అర్హులుగా ప్ర‌క‌టించారు. దీని ద్వారా వెయ్యి రూపాయాలు దాటిని ఏ వైద్యం అయినా ఈ ప‌దకం ద్వారా ఉచిత వైద్యం పొందే అవ‌కాశం ఏర్ప‌డుతంది. గ‌తంలో లాగానే కార్పోరేట్ ఆస్ప‌త్రు ల్లో సేవ‌లు పొందే అవ‌కాశం క‌లుగుతుంది. దీని కోసం యూనిక్ హెల్గ్ కార్డులు మంజూరు చేయ‌నున్నారు.

 చికిత్స ఎక్క‌డ తీసుకున్నా..ఎంతైనా..

చికిత్స ఎక్క‌డ తీసుకున్నా..ఎంతైనా..

రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు వైయ‌స్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద 23 జిల్లాల్లో ఏ ఆస్ప‌త్రిలో అయినా ట్రీట్‌మెంట్ తీసుకొనే అవ‌కాశం ఉండేది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత టీడీపీ హ‌యాంలో ఆరోగ్య శ్రీ ప‌ధ‌కాన్ని ఏపీ ప్ర‌జ‌ల‌కు కేవ‌లం ఏపీలోని ఆస్ప‌త్రుల‌కే ప‌రిమితం చేసారు. అయితే, న‌వ‌ర‌త్నాల ప‌ధ‌కం అమ‌ల్లో భాగం గా..ఆరోగ్య శ్రీని యూనిక్ కార్డు ద్వారా అంద‌రికీ అందుబాటులో తేవాల‌ని నిర్ణ‌యించారు. దీని ద్వారా చికిత్స కోసం ఏపీ లోనే కాకుండా హైద‌రాబాద్..చెన్నై..బెంగుళూరు..ముంబాయి..ఇలా ఏ ఆస్ప‌త్రిలో అయినా చికిత్స పొందే అవ‌కాశం ఏర్ప‌డుతోంది. వెయ్యి రూపాయాలు దాటిని ఏ చికిత్స అయినా ఈ ప‌ధ‌కం కింద‌కు వ‌స్తుంది. అదే స‌మ‌యంలో ఇప్పుడు ఆరోగ్య శ్రీ ప‌ధ‌కం కింద ఉన్న జ‌బ్బుల‌తో పాటుగా.. మ‌రో 151 ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కొత్త‌గా చేర్చారు. ఈ విధానం గురించి బ‌డ్జెట్ ప్ర‌సంగంలో స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు.

ప్ర‌తీ మండ‌లంలో 108 వాహ‌నాలు..

ప్ర‌తీ మండ‌లంలో 108 వాహ‌నాలు..

వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత 108 అంబులెన్స్‌ల నిర్వ‌హ‌ణ స‌రిగ్గా లేదు. గ‌త ప్ర‌భుత్వంలో 108 వాహ‌నాలు దాదాపుగా మూల‌న ప‌డ్డాయి. దంతో..ఆరోగ్య శ్రీ స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించ‌టం కోసం ప్ర‌తీ మండ‌లంలో అంబులెన్స్‌ల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మొత్తంగా ఈ బడ్జెట్‌లో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1740 కోట్లు
కేటాయించారు. అదే విధంగా..ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1500 కోట్లు ప్ర‌తిపాదించారు. ప్ర‌భు త్వ ఆస్ప‌త్రుల అభివృద్ది క‌మిటీ చైర్మ‌న్లుగా స్థానిక ఎమ్మెల్యేల‌ను నియ‌మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులను ద‌శ‌ల వారీగా అభివృద్ది చేస్తామ‌ని ఆర్దిక మంత్రి ప్ర‌క‌టించారు.

English summary
AP Govt given top priority for Arogya Sri health scheme. Ginance Minister Allotted rs 1740 cr for this scheme. Govt decided to give unique health cards for all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X