నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు..!!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలో కొత్తగా విడుదల చేసే ఉద్యోగాల భర్తీ క్యాలెండర్లకు ముందు వయో పరిమితి పెంపు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల వయో పరిమితి 34 సంవత్సరాలు. ప్రతీ ఏటా జనవరిలో కొత్త ఉద్యోగాల భర్తీ కేలండర్ విడుదల చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. దీంతో పాటుగా ఇప్పటికే ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇక, ఏపీలో పూర్తి స్థాయిలో చాలా కాలంగా ఉద్యోగాల భర్తీ లేకపోవటంతో..ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో..ఏ వయసు వరకు సడలింపు ఇవ్వాలనే దాని పైన చర్చ సాగుతోంది. త్వరలోనే దీని పైన ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఏపీలో పోలీసు ఉద్యోగాల జాతర: 11,696 పోస్టుల భర్తీకి చర్యలు: త్వరలో నోటిఫికేషన్...!

వయోపరిమితి సడలింపు..
ఏపీలో వచ్చే నెల నుండి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు రంగం సిద్దం చేస్తున్నారు. దీంతో.. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు మేలు చేసే విధంగా వయో పరిమితి సడలింపు ఉండాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీని కోసం గతంలో అమలు చేసిన వయో పరిమితి సడలింపు నిర్ణయాలతో పాటుగా..ఏ వయసు వారు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారనే అంశం మీద ప్రభుత్వం సమాచారం తెప్పిస్తోంది. తాము తీసుకొనే నిర్ణయం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం కలగాలని భావిస్తోంది. ఇప్పటికే ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ విధానం రద్దు చేయటంతో ఈ సారి నోటిఫికేషన్లుకు పోటీ సైతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వయో పరిమితిని 42 ఏళ్లకు సడలిస్తూ తీసుకున్న నిర్ణయం కాల పరిమితి సెప్టెంబర్ తో ముగిసింది. దీంతో..ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ల జారీకి ముందే వయో పరిమితి సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది.

42 ఏళ్లకా..44 ఏళ్ల వరకా..
ఏపీలో గతంలో ప్రభుత్వ ఉద్యోగార్థులకు వయోపరిమితి 34ఏళ్లు కాగా, వై.ఎ్‌స.రాజశేఖరరెడ్డి హయాంలో దీన్ని 39ఏళ్లకు పెంచారు. ఆ తర్వాత సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి వయోపరిమితిని 36ఏళ్లకు తగ్గించారు. అనంతరం 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 42ఏళ్లకు పెంచారు. రిక్రూట్మెంట్లను బట్టి వయోపరిమితిని ఎప్పటికప్పుడు సడలిస్తూ వస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన వయోపరిమితి సడలింపు ఉత్తర్వుల గడువు 2019 సెప్టెంబరు 30తో ముగిసింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి వయోపరిమితి 34 సంవత్సరాలే. ఇకపై ఏటా రిక్రూట్మెంట్లు ఉంటాయని, ప్రతి జనవరిలోనే క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు 2020లో చేపట్టే రిక్రూట్మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలతో ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల వయోపరిమితి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వయోపరిమితి సడలించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం..
చంద్రబాబు ప్రభుత్వం లో తీసుకున్న వయో పరిమితి సడలింపు గడువు సెప్టెంబర్ తో ముగిసింది. దీంతో..పాత నిబంధనల ప్రకారం వయో పరిమితి 34 ఏళ్లుగా ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత
ఇకపై ఏటా రిక్రూట్మెంట్లు ఉంటాయని, ప్రతి జనవరిలోనే క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు 2020లో చేపట్టే రిక్రూట్మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలతో ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థుల వయోపరిమితి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వయోపరిమితి సడలించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని పైన ఏ మేరకు సడలింపు ఇవ్వాలనే అంశం మీద ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు.