విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Nimmagadda కు ఏపీ హైకోర్టు షాక్‌- ఈ వాచ్‌ యాప్‌ వాడొద్దని ఆదేశాలు- కారణమిదే

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా వైసీపీ సర్కారుకూ, ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ కూ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధంతో తెరపైకి వచ్చిన ఈ-వాచ్‌ యాప్‌కు భంగపాటు తప్పలేదు. ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా ఈ యాప్‌ను తీసుకొచ్చిన నిమ్మగడ్డకు హైకోర్టులో నిరాశ తప్పలేదు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలను గుర్తించేందుకు, ఫిర్యాదుల కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఈ-వాచ్‌ యాప్‌ను ప్రారంభించారు. అయితే ప్రభుత్వం వివిధ కారణాలతో దీన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం ఇప్పటికే నిఘా కోసం రెండు యాప్‌లు పనిచేస్తున్నాయని, ఈ కొత్త యాప్‌ అవసరం లేదని వాదించింది. అయినా ఎస్ఈసీ వినలేదు. దీంతో ప్రభుత్వం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు ఈ వాచ్ యాప్‌కు అనుమతి నిరాకరించింది.

ap high court denied permission to secs e-watch app due to security reasons

ఎస్‌ఈసీ తీసుకొచ్చిన ఈ వాచ్‌ యాప్‌కు భద్రతా అనుమతులు తీసుకోకపోవడంతో, వాటి కోసం దరఖాస్తు చేసినా ఆలస్యం అవుతుండటం వంటి కారణాలతో యాప్‌కు చుక్కెదురైంది. ఈ యాప్‌ను గుర్తించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నిఘా యాప్‌తో పాటు సీ-క్యాప్‌ యాప్‌ను వాడుకుంటామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
దీంతో హైకోర్టు ఈ యాప్‌పై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

English summary
andhra pradesh high court denied permission to state election commission's e-watch app for panchayat elections due to security reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X