విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మగడ్డకు సహాయనిరాకరణ- జగన్‌సర్కారుపై హైకోర్టు ఆగ్రహం- మూడురోజుల డెడ్‌లైన్...

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విషయంలో సహాయనిరాకరణ చేస్తుండటంపై హైకోర్టు మరోసారి సీరియస్‌ అయింది. రాజ్యాంగ సంస్ధ అయిన ఎన్నికల కమిషన్‌కు సహకరించడపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై మూడు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే మూడు రోజుల్లోగా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ కోరిన సహకారం అందించడంతో పాటు ఆ విధంగా చేసినట్లు నివేదిక ఇవ్వాలని సూచించింది.

వైసీపీ సర్కారుకు భారీ షాక్‌- స్ధానిక ఎన్నికలు రద్దు చేయమని నిమ్మగడ్డకు విపక్షాల వినతి...వైసీపీ సర్కారుకు భారీ షాక్‌- స్ధానిక ఎన్నికలు రద్దు చేయమని నిమ్మగడ్డకు విపక్షాల వినతి...

జగన్‌ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం..

జగన్‌ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం..

తమకు నచ్చని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ను న్యాయబద్ధంగా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సహాయనిరాకరణ చేస్తోందా అని ఇవాళ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వానికి నచ్చిన వ్యక్తి కమిషనర్‌గా ఉంటే ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ప్రభుత్వం సహకరించకపోవడంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎస్‌ఈసీ వ్యపహారంలో ప్రభుత్వ తీరు సరికాదని తెలిపింది. ఎస్‌ఈసీకి ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సహకరించడం లేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగబద్ధ సంస్ధలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు వస్తాయి వెళ్తాయి రాజ్యాంగ బద్ధ సంస్ధలు ఎప్పుడూ పనిచేస్తాయని హైకోర్టు తెలిపింది.

మూడు రోజుల్లో సహకరించకపోతే తీవ్ర పరిణామాలు..

మూడు రోజుల్లో సహకరించకపోతే తీవ్ర పరిణామాలు..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తన విధి నిర్వహణలో భాగంగా కోరిన వాటిని సమకూర్చాల్చిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అయినా ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తుండటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రోజుల్లోగా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ కోరినవన్నీ సమకూర్చాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. నిమ్మగడ్డ కోరినవన్నీ ఆయనకు సమకూర్చినట్లు మూడురోజుల్లో ప్రభుత్వం ఓ నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

జగన్‌ సర్కారుపై సమగ్ర నివేదిక...

జగన్‌ సర్కారుపై సమగ్ర నివేదిక...

రాష్ట్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణకు సహకరించకుండా జగన్‌ సర్కారు సహాయ నిరాకరణ చేస్తున్న తీరుపై మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ ఈ వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ అందులో పొందుపర్చాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం తర్వాత కరోనా తర్వాత వాయిదా వేయడం, నిమ్మగడ్డ తొలగింపు, హైకోర్టు ఆదేశాలతో తిరిగి బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత ప్రభుత్వంతో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు వంటి అంశాలన్నీ హైకోర్టుకు నివేదిక ఇచ్చేందుకు నిమ్మగడ్డ సిద్ధమవుతున్నారు.

Recommended Video

AP 3 Capitals : Final Hearing In AP Highcourt On 3 Capitals Petition | Oneindia Telugu
కనగరాజ్‌కు ప్రభుత్వ చెల్లింపులా ?

కనగరాజ్‌కు ప్రభుత్వ చెల్లింపులా ?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం చెల్లదని తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన న్యాయపోరాటం కోసం ప్రభుత్వం ఖర్చుపెట్టడమేంటని హైకోర్టు నిలదీసింది. కనగరాజ్‌కు ప్రభుత్వం ఎలాంటి ఖర్చులూ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. కనగరాజ్‌ ఆ డబ్బుల్ని వ్యక్తిగతంగానే ఖర్చుపెట్టుకోవాలని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. ప్రజాధనాన్ని ఎందుకిలా వృథా చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వీటన్నింటినీ ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ పరిశీలించాలని జస్టిస్‌ సీతారామమూర్తి, అశ్వినీకుమార్‌తో కూడిన ధర్మానం ఆదేశించింది.

English summary
andhra pradesh high court on tuesday seek state election commission report on jagan govt's non-cooperation to sec nimmagadda ramesh. hc made serious comments on govt in this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X