విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ సర్కారుకు భారీఝలక్‌- పంచాయతీ పోరుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌- నెగ్గిన నిమ్మగడ్డ వాదన

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను డివిజన్‌ బెంచ్ ఇవాళ కొట్టేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్న కారణంతో ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు అంగీకరించలేదు. దీంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహేంచేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు భారీ ఊరట లభించినట్లయింది.

Recommended Video

AP Local Body Elections: Andhra Pradesh high court Green Signal to Panchayat Elections

నిమ్మగడ్డకు హైకోర్టు భారీ షాక్‌- పంచాయతీ పోరుకు బ్రేక్‌- నోటిఫికేషన్‌ సస్పెండ్‌నిమ్మగడ్డకు హైకోర్టు భారీ షాక్‌- పంచాయతీ పోరుకు బ్రేక్‌- నోటిఫికేషన్‌ సస్పెండ్‌

పంచాయతీ పోరుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

పంచాయతీ పోరుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గతంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జారీ చేసిన షెడ్యూల్‌ను హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డకు ఇవాళ భారీ ఊరట దక్కింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎల్లుండి నుంచి పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.

ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమే

ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమే

పంచాయతీ ఎన్నికలను సస్పెండ్‌ చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాగే తీర్పులో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్నందున ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రంలో ప్రజారోగ్యంతో పాటు ఎన్నికలు కూడా ముఖ్యమేనని తేల్చిచెప్పింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది.

చెల్లని వైసీపీ ప్రభుత్వ వాదన

చెల్లని వైసీపీ ప్రభుత్వ వాదన

వైసీపీ సర్కారు నిమ్మగడ్డ హయాంలో పంచాయతీ ఎన్నికలు జరగకుండా చూడాలని శతవిథాలుగా ప్రయత్నించింది. తానే స్వయంగా పిటిషన్లు వేయడమే కాకుండా ఉద్యోగ సంఘాలతో కూడా ఎన్నికలు వద్దంటూ రిట్లు వేయించింది. అయితే ప్రస్తుతం పరిమిత స్ధాయిలో సాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ వీరు చేసిన వాదనను హైకోర్టు అంగీకరించలేదు. వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌పై పూర్తి వివరాలు తెప్పించుకున్న హైకోర్టు... ఇందుకోసం ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

పంతం నెగ్గించుకున్న నిమ్మగడ్డ

పంతం నెగ్గించుకున్న నిమ్మగడ్డ

రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగకుండా అడుగడుగునా అడ్డుపడుతున్న ప్రభుత్వంతో సై అంటే సై అనేలా పోరాడిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌..చివరికి పంతం నెగ్గించుకున్నారు. స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా, సహాయ నిరాకరణ ఎదురైనా నిమ్మగడ్డ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. హైకోర్టు కూడా నిమ్మగడ్డ వాదనకే మద్దతివ్వడంతో ఎన్నికల విషయంలో ఆయన తొలి విజయం సాధించినట్లయింది. ఇక మిగతా స్ధానిక ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన పరిస్ధితులు వస్తే ప్రభుత్వంపై నిమ్మగడ్డ పూర్తి స్దాయిలో పైచేయి సాధించినట్లే అవుతుంది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే

ఏపీలో ఇప్పటికే ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎల్లుండి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు విడతలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. జనవరి 23న తొలి విడత, 27న రెండో విడత, 31న మూడో విడత, ఫిబ్రవరి 4న నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 5 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9 న రెండోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 న మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17 న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

English summary
andhra pradesh high court on thursday lifted suspension order issued by single bench earlier on holding panchat elections in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X