విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యాయమూర్తులపై సోషల్‌ మీడియా కామెంట్లు- సీబీఐ దర్యాప్తుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులపై ఓవైపు సీఎం జగన్‌ సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు లేఖ రాసిన నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఇస్తున్న తీర్పులపై సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, నేతలు చేస్తున్న వ్యాఖ్యల విషయంలో ఇప్పటికే సీరియస్‌గా రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదన్న ప్రభుత్వం- ఎస్‌ఈసీ చెప్పాలన్న హైకోర్టు...ఏపీలో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదన్న ప్రభుత్వం- ఎస్‌ఈసీ చెప్పాలన్న హైకోర్టు...

న్యాయవ్యవస్ధపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్బంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎనిమిది వారాల్లోగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందజేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల హైకోర్టు జడ్జిలపై సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ దర్యాప్తులో సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ap high court orders cbi inquiry on social media comments against judiciary

Recommended Video

Ys Jagan కంప్లైంట్ To SC Chief Justice Bobde Against Andhra HC,SC Judge NV Ramana | Oneindia Telugu

ఏపీ హైకోర్టు కొన్ని నెలలుగా ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వైసీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు తీవ్రమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. వీటిపై లక్ష్మీనారాయణ అనే న్యాయవాది ఓ పిటిషన్‌ దాఖలు చేయగా... ఆ తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు ఆధారంగా హైకోర్టు మరో సుమోటో కేసు నమోదు చేసింది. వీటి విచారణ సందర్భంగా హైకోర్టు ఏపీ సీఐడీకి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే మొత్తం 98 మందికి నోటీసులు జారీ చేసినా కేవలం 18మందిపైనే అదీ నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారంటూ తాజాగా కర్నూలుకు చెందిన మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి మరో పిటిషన్‌ వేశారు. అంతటితో ఆగకుండా వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌ వీటి వెనుక ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది.

English summary
andhra pradesh high court on monday orders cbi inquiry over social media comments against the judiciary in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X