విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Vizag gas leak: సుమోటోగా హైకోర్టు, ఏపీ, కేంద్ర సర్కారుకు నోటీసులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ఈ ఘటన ప్రజల ప్రాణాలతో కూడుకున్న నేపథ్యంలోనే సుమోటోగా తీసుకోవడం జరిగిందని హైకోర్టు స్పష్టం చేసింది.

విశాఖ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారాన్ని ప్రకటించిన వైఎస్ జగన్ విశాఖ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారాన్ని ప్రకటించిన వైఎస్ జగన్

జనావాసాల మధ్య ఇలాంటి ప్రమాదకర పరిశ్రమ ఎలా ఉందని హైకోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అమికస్ క్యూరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

AP High Court stat govt on Vizag gas leak incident.

Recommended Video

COVID-19 : Coronavirus Didn't Even Leave Supreme Court,1 Test Positive,2 In Quarentine

ఇది ఇలావుండగా, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో రాష్ట్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నోటీసులు పంపింది.
గ్యాస్ లీకేజీ ఘటన విషయమై సమాధానామివ్వాలని కమిషన్ తన నోటీసుల్లో ఆదేశించింది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేరుపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.

కాగా, గ్యాస్ లీకేజీ ఘటన, తర్వాతి పరిణామాలను మీడియా ద్వారా తెలుసుకుంటున్న జాతీయ మానవ హక్కుల సంఘం.. లీకేజీ అనంతరం సహాయక చర్యలు కూడా వివరించాలని ఆదేశించింది. కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఇప్పటి వరకు 10 మృతి చెందగా, 200 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

English summary
AP High Court stat govt on Vizag gas leak incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X