• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీజేపీ గూటికి ఏపీ నేతలు.. గంగుల సహా మరికొందరు.. జేపీ నడ్డాతో భేటీ

|

అమరావతి : తెలుగు రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది. ఆపరేషన్ కమలం స్పీడప్ చేస్తూ ఇతర పార్టీల నేతలను పార్టీలోకి లాగుతున్నారు. ఆ క్రమంలో ఏపీకి చెందిన పలువురు నేతలు కాషాయం కండువా కప్పుకున్నారు. కమల తీర్థం పుచ్చుకుని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి క‌ృషి చేస్తామని ప్రకటించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే, ఎంపీ ఐన టీడీపీ నేత గంగుల ప్రతాప రెడ్డి, టీడీపీ చిత్తూరు ఓబీసీ సెల్ కార్యదర్శి డి.వెంకయ్య, టీడీపీ దివంగత ఎంపీ లాల్ జాన్ బాషా సోదరుడు టీడీపీ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ షేక్ నిజాముద్దీన్, కావలి జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్, ప్రముఖ వ్యాపారవేత్త మజర్ బేగ్, ఆదాయ పన్నుశాఖ విశ్రాంత కమిషనర్ కంచర్ల హరిప్రసాద్ తదితరులు తమ అనుచరగణంతో బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు.

ap leaders joins in bjp met with jp nadda

తిరుమల లడ్డూ పుట్టిన రోజు.. సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు.. ఇంతకు ఎన్నేళ్లు..!

అనంతరం బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఏపీలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కొద్దిసేపు చర్చించారు. రాయలసీమలో సమస్యలు, పరిష్కార మార్గాలను ఆయన ద‌ృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో సుపరిపాలన సాధ్యమైందని గుర్తు చేశారు. ఆ క్రమంలో దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని.. అందుకే ఆయన విధానాలు నచ్చి ఆ అభివృద్దిలో భాగస్వాములం కావడానికే పార్టీలో చేరినట్లు తెలిపారు. మోడీ నేతృత్వంలో పనిచేయాలనే బలమైన ఆకాంక్షతో కాషాయం కండువా కప్పుకున్నట్లు వివరించారు.

2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళతామని ప్రకటించారు. ఆ మేరకు శాయశక్తులా పనిచేసి బీజేపీకి అధికారం కట్టబెడతామని చెప్పుకొచ్చారు. బీజేపీలో చేరిన పలువురి నేతలతో పాటు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేశ్ యాదవ్, ఇతర పార్టీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
The BJP is eyeing the Telugu states. Operation Kamalam Speedup is pulling the leaders of other parties into the party. Many Leaders went to Delhi under the leadership of AP BJP state president Kanna Laxminarayana and joined the party in the presence of BJP's national general secretary Muralidhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X