విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు యూజ్‌ అండ్‌ త్రో- సీఎం అయ్యందుకే విద్వేషాలు-లోకేష్‌ మిడత- కొడాలి కామెంట్స్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పేరెత్తితే మండిపడే వారిలో మొదటి వరుసలో ఉంటారు మంత్రి కొడాలి నాని. టీడీపీని వీడినప్పటి నుంచి చంద్రబాబుపై ఆయన తీవ్ర స్ధాయిలో మొదలుపెట్టిన విమర్శల దాడి ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతోంది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న దేవాలయాల ఘటనల విషయంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలపై కొడాలి నాని ఇవాళ మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు యూజ్‌ అండ్‌ త్రో మనిషని, చిత్త కార్తె కుక్క అంటూ తీవ్ర పరుష పదజాలంతో నాని ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో కొడాలి విమర్శలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

గుడివాడలో పేకాటపై ఎస్‌ఈబీ పంజా- పవన్ ఆరోపణలే నిజం- స్పందించని కొడాలి నానిగుడివాడలో పేకాటపై ఎస్‌ఈబీ పంజా- పవన్ ఆరోపణలే నిజం- స్పందించని కొడాలి నాని

Recommended Video

కృష్ణా: చ‌ంద్ర‌బాబు మ‌నిషే కాదు : స‌ంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంత్రి కొడాలి నాని
చంద్రబాబుపై విరుచుకుపడ్డ కొడాలి నాని

చంద్రబాబుపై విరుచుకుపడ్డ కొడాలి నాని

ఏపీలో తాజాగా చోటు చేసుకున్న విగ్రహాల ధ్వంసంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు కొడాలి నాని ఇవాళ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు అసలు మనిషే కాదన్నారు. చిత్తకార్తి కుక్కతో సమానమంటూ తీవ్ర పదజాలం వాడారు. వాడుకోవడం, వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని కొడాలి విమర్శించారు. 74 ఏళ్ల వయసులో, ఇంత రాజకీయ అనుభవం ఉండి మతాలు, కులాల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని కొడాలి ధ్వజమెత్తారు. చంద్రబాబు కుల మతాల ప్రస్తావన దారుణమన్నారు.

 అంతా క్రిస్టియన్లు అంటావా చంద్రబాబూ...

అంతా క్రిస్టియన్లు అంటావా చంద్రబాబూ...

సీఎం జగన్‌, హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్‌, విజయనగరం జిల్లా ఎస్పీ అందరూ క్రిస్టియన్లే అంటూ చంద్రబాబు మాట్లాడటం దారుణమని కొడాలి నాని అన్నారు. అధికారులు మతాల వారీగా పనిచేయరని, అన్ని వర్గాల కోసం పనిచేస్తారని కొడాలి పేర్కొన్నారు. చంద్రబాబు లాంటి నీచుల కోసమే అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతలు తీసుకునేటప్పుడు కుల,మత, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని పెద్దలు ప్రమాణ స్వీకారం చేయిస్తారని కొడాలి గుర్తుచేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆదరించబట్టే చంద్రబాబు ఈ స్ధాయిలో ఉన్నారని కొడాలి అన్నారు.

సీఎం పదవి కోసం విద్వేషాలు రెచ్చగొట్టాలా ?

సీఎం పదవి కోసం విద్వేషాలు రెచ్చగొట్టాలా ?

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో ఉచ్చనీచాలు లేకండా రాష్ట్రంలో మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చూస్తున్న ప్రజలే అతన్ని భూస్ధాపితం చేయాలని కొడాలి పిలుపునిచ్చారు.


జగన్ గురించి మిడత లాంటి లోకేష్‌ మాట్లాడటం విడ్డూరమన్నారు. వైఎస్‌ జగన్ అంటే ఓ వ్యవస్ధ అని, భగవంతుని, వైఎస్సార్‌ ఆశీస్సులతో జగన్ చేస్తున్న సంక్షేమ పాలన ఓర్వలేని ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని కొడాలి ఆరోపించారు.

English summary
andhra pradesh civil supplies miniser kodali nani made some controversial comments against chandrababu's temple politics amidst of recent incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X