విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

40 ఇయర్స్ ఇండస్ట్రీ కోడిగుడ్డుపై ఈకలు పీకుతుండు, పవన్ కల్యాణ్ చంద్రబాబు డుప్లికెట్: మంత్రి కొడాలి

|
Google Oneindia TeluguNews

రాజధాని మార్పుపై సీఎం జగన్ ప్రకటన చేయలేదని, కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయొచ్చని మాత్రమే చెప్పారని మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. కానీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనతో రాజధాని ప్రకటన జరిగినట్టు విపక్ష నేతలు భావిస్తున్నారని దుయ్యబట్టారు. కమిటీ నివేదిక సమర్పించాలి, దానిని ప్రభుత్వం ఆమోదిస్తేనే రాజధాని మార్పు ఉంటుందనే విషయం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు తెలియదా అని కొడాలి నాని ప్రశ్నించారు.

3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడమే లక్ష్యం, ప్రజాభీష్టం మేరకు రాజధానులు: మంత్రి కొడాలి నాని3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడమే లక్ష్యం, ప్రజాభీష్టం మేరకు రాజధానులు: మంత్రి కొడాలి నాని

40 ఇయర్స్ ఇండస్ట్రీ

40 ఇయర్స్ ఇండస్ట్రీ

40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటోన్న చంద్రబాబు నాయుడుకు కమిటీ ఏర్పాటు, నివేదిక అనే అంశాలు తెలియదా అని కొడాలి నాని ప్రశ్నించారు. తాను ప్రాతిపాదించిన అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏమైపోయినా ఫరవాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కొడాలి నాని స్పష్టంచేశారు.

 ఆల్ ఆర్ ఈక్వల్

ఆల్ ఆర్ ఈక్వల్

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపై సీఎం జగన్ సమదృష్టితో చూస్తున్నారని తెలిపారు. రాయలసీమ ప్రజల నీటి కోసం రూ.40 వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. కర్నూలులో జ్యుడిషీయల్ క్యాపిటల్‌తో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కానీ చంద్రబాబుకు ఇవేమి పట్టవని విమర్శించారు. కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు.. రాజధానిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

టీడీపీ నేతలు కూడా

టీడీపీ నేతలు కూడా

మూడు రాజధానులపై టీడీపీ నేతలు సానుకూలంగా ఉన్నారని కొడాలి నాని చెప్పారు. మీరు చేయనిది జగన్ చేస్తుంటే ఎందుకు అక్కసు అని ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఏ పని పాట లేదని విమర్శించారు. అందుకే ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు డూప్లికేట్ అని పేర్కొన్నారు. ఏం మాట్లాడాలో కూడా చంద్రబాబే స్క్రిప్ట్ ఇస్తారని చెప్పారు.

కొత్త బిచ్చగాడు..

కొత్త బిచ్చగాడు..

సుజనా చౌదరిపై కూడా కొడాలి నాని ఫైరయ్యారు. ఆయన బీజీపీలో కొత్త బిచ్చగాడు అని విమర్శించారు. టీడీపీలో ఉంటే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారనే భయంతోనే బీజేపీలో చేరారని చెప్పారు. పొద్దు ఎరుగని సుజనా చౌదరి రాజధానిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ఏమైనా బీజేపీలో సిద్ధాంతకర్తనా అని ప్రశ్నించారు.

English summary
ap minister kodali nani fire on chandrababu naidu, pawan kalyan on ap capital change issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X