విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కొడాలి నాని

|
Google Oneindia TeluguNews

విజయవాడ: పదవీ విరమణ చేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు. గూగుల్‌లో వైఎస్ జగన్ గురించి వెతకగా.. ఆయనపై కేసులు నమోదైనట్లు సమాచారం వచ్చిందంటూ జస్టిస్ రాకేష్ కుమార్ చెప్పడాన్ని తప్పు పట్టారు. ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో.. అలాంటి సమాచారాన్నే గూగుల్ అందిస్తుందని చెప్పారు.

Recommended Video

Pawan Kalyan పై భగ్గుమన్న Kodali Nani | జగన్‌ శివలింగం, పవన్‌ బోడిలింగం అంటూ కౌంటర్

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని నందివాడ మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ.. ఎలాంటి బలవంతుడినైనా ఢీ కొట్టే శక్తి ఉన్న నేతగా దేశ రాజకీయాల్లో వైఎస్ జగన్ పేరు తెచ్చుకున్నారని అన్నారు. తాను గూగుల్‌లో వైఎస్ జగన్ గురించి సెర్చ్ చేస్తే.. ఎవరి కాళ్లు పట్టుకోని నేతగా, కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచిన నాయకుడిగా రిజల్ట్ వచ్చిందని వ్యాఖ్యానించారు.

AP Minister Kodali Nani slams TDP and Jana Sena Chief Chandrababu and Pawan Kalyan

దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి కూడా కనీసం ఊహకు కూడా అందని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన నేతగా తనకు గూగుల్ వైఎస్ జగన్ గొప్పదనం గురించి వివరించిందని కొడాలి నాని అన్నారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చిన సమాచారాన్ని తీర్పు కాపీలో పెట్టారని చెప్పారు. వైఎస్ జగన్ గురించి రిటైర్డ్ జస్టిస్ రాకేష్ కుమార్‌కు ఎలాంటి సమాచారం వెలువడిందో.. తాను గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి అలాంటి సమాచారం వచ్చిందని ఎద్దేవా చేశారు.

గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి, జగన్ గురించి, వారి కుటుంబ నేపథ్యం ఉంటుందని, ఎంతమంది దుర్మార్గులు అడ్డుపడినప్పటికీ..ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారనే విశ్వాసం గల నాయకులుగా వారి గురించి గూగుల్ తెలుపుతుందని అన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్ ప్రజల గుండెల్లోనే కాదు గూగుల్‌లో కూడా నిలిచిపోయారని అన్నారు.

ఏ మంచి పనిచేసినా అడ్డు పడాలనే దుర్మార్గులు రాష్ట్రంలో ఉన్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు. ఎంతమంది కలిసకట్టుగా వచ్చి అడ్డుపడ్డా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి అమలు చేస్తారని చెప్పారు. రాష్ట్రానికి చాలామంది వస్తుంటారు పోతుంటారని జస్టిస్ రాకేష్ కుమార్ గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని చెప్పారు.

English summary
AP Minister Kodali Nani slams Telugu Desam Party Chief Chandrababu and Jana Sena Party President Pawan Kalyan comments on Chief Minister YS Jagan Mohan Reddy. He also condemned Retired Justice Rakesh Kumar comments on YS Jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X