విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ .. వదలని మహమ్మారి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆరోగ్య సంక్షోభం నెలకొంది. కరోనా మహమ్మారి కట్టడి చేయడం కోసం, ఆసుపత్రులలో వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నాయి . ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు గా సమాచారం . దీంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటూ వైద్యం తీసుకుంటున్నారు. దీనిని అధికారికంగా నిర్ధారించలేదు .

ప్రాణాంతక మహమ్మారి : ప్రపంచ రికార్డులు బద్దలు .. 3.32 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు 2,263 మరణాలు ప్రాణాంతక మహమ్మారి : ప్రపంచ రికార్డులు బద్దలు .. 3.32 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు 2,263 మరణాలు

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా బారిన పడ్డారని తెలిసిన వైసీపీ నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన కారణంగా జిల్లాలో నిర్వహించిన కరోనా సమీక్షకు మంత్రి అనిల్ కుమార్ ఒక్కరే హాజరయ్యారు. ఇప్పటికే తెలంగాణా మంత్రి కేటీఆర్ కూడా తాను కరోనా బారిన పడ్డానని ప్రకటించారు .
ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, హోమ్ క్వారంటైన్ అవ్వాలని పేర్కొన్నారు .

AP Minister Mekapati Goutham reddy tested corona positive , Now in home isolation

ఇదిలా ఉంటే నిన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఆస్పత్రులలో ఆక్సిజన్ సరఫరా ఏ విధంగా సాగుతుంది అన్నదానిపై నిర్వహించిన సమీక్ష సమావేశం పై ట్వీట్ చేశారు. ఆక్సిజన్ సరఫరాని పెంచే మార్గాలపై సమావేశంలో చర్చించామని, ఉత్పత్తిని పెంచేందుకు, రవాణాను వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ట్వీట్ చేశారు. స్థానిక పారిశ్రామిక విభాగాలతో చర్చించి ఎక్కడ ఆక్సిజన్ కొరత ఉంటే అక్కడ కొరతను తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

English summary
Andhra Pradesh Industries Minister Mekapati Goutham Reddy has been tested corona positive. With this he stays at home isolation and takes medicine. YCP leaders, wish him a speedy recovery. Minister Anil Kumar was the only one to attend the corona review conducted in the district as Mekapati Goutham Reddy was diagnosed with corona positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X