విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్ కు మంత్రి సవాల్ .. ఆధారాలతో వస్తా.. చర్చకు రెడీనా ? ఏపీలో మాటల యుద్ధం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అరెస్టులతో అట్టుడుకుతున్నాయి .ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి ముఖ్య నేతల వరుస అరెస్టులతో టిడిపి అధికార పార్టీపై నిప్పులు చెరుగుతోంది. నిన్నటికి నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులపై నిప్పులు చెరిగిన లోకేష్ ఇక తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ మండిపడ్డారు. ఇక మాజీ మంత్రి లోకేష్ కి కౌంటర్ గా మంత్రి పేర్ని నాని లోకేష్ కు సవాల్ విసిరారు.ఆధారాలతో వస్తా చర్చకు సిద్ధమా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని.

 అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ? ఏసీబీ చెప్పిందేంటి ? అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ? ఏసీబీ చెప్పిందేంటి ?

నిరూపించటానికి మేం సిద్ధం అన్న మంత్రి

నిరూపించటానికి మేం సిద్ధం అన్న మంత్రి

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ల వ్యవహారంలో లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని జేసీ ప్రభాకర్ రెడ్డి, అచ్చెన్నాయుడు ఏ తప్పూ చేయలేదని నిరూపించగలరా అంటూ లోకేష్ ను సూటిగా ప్రశ్నించారు. ఇక అంతే కాదు వారు తప్పు చేశారని తాను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. లోకేష్ కు సవాలు విసిరిన ఆయన ఎక్కడైనా నేను చర్చ కు సిద్ధం.. తప్పు చేయలేదని నిరూపించగలరా?అని సూటి ప్రశ్నలు వేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అవినీతి అక్రమాల ఆధారాలతో తాను వస్తానని పేర్కొన్నారు.

చంద్రబాబుకు ధైర్యం ఉందా ?

చంద్రబాబుకు ధైర్యం ఉందా ?

జెసి బ్రదర్స్ చేసిన వ్యాపారమంతా అవినీతి వ్యాపారం అని ఆయన మండిపడ్డారు. ఐరన్ స్క్రాప్ కింద కొన్న నాలుగు లారీలను బస్సుల కింద మార్చారని పేర్కొన్న పేర్ని నాని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జేసీ బ్రదర్స్ సుప్రీం తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు.154వాహనాలకు ఫేక్ ఎన్.ఓ.సీలు తీసుకుని భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని గొంతు చించుకుంటున్న చంద్రబాబు నాయుడుకు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలు అవినీతికి పాల్పడలేదని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

ఆయన ఏం పొడిచాడని మాకు భయం

ఆయన ఏం పొడిచాడని మాకు భయం


అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చంద్రబాబు, లోకేష్, ఉమ, ఇంకా ఎవరైనా సిద్ధంగా ఉండాల్సిందేననిహెచ్చరించిన మంత్రి ఏడాది కాలంగా అసెంబ్లీలో అచ్చెన్నాయుడు ఏం పొడిచాడని ఆయనను చూస్తే వైసీపీ నేతలు భయపడటానికి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతల నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు. అవినీతి చేసి, గగ్గోలు పెడితే లాభం లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. టిడిపి హయాంలో జరిగిన అవినీతిని నిరూపించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్ని నాని పేర్కొన్నారు.

English summary
Lokesh's comments on the arrests of atchannaidu and JC Prabhakar Reddy have been questioned by AP Transport Minister perni Nani .He also stated that he was ready to prove that they had done Corruption. He challenged Lokesh and anywhere else I was ready to debate .. Can you prove me wrong? Asked
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X