• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో ఎన్నికల ప్రలోభాలు .. విజయవాడలో భారీగా నగదు పట్టుకున్న అధికారులు

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి తెరపడింది. ఇక ప్రలోభాల పర్వం షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్లు , మున్సిపాలిటీలను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరతీశాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రలోభాలకు చెక్ పెట్టాలని చూస్తుంది.

 విజయవాడలో భారీగా నగదు పట్టుకున్న అధికారులు

విజయవాడలో భారీగా నగదు పట్టుకున్న అధికారులు

విజయవాడలోని 57వ డివిజన్లో న్యూ రాజరాజేశ్వరి పేట కు చెందిన వెల్డర్ పిల్ల కూర్మ నాయకులు అమరావతి కాలనీలో నివాసముంటున్నారు . అతని ఇంట్లో భారీగా డబ్బు నిల్వ చేశారని సమాచారంతో టాస్క్ ఫోర్స్, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 48.44 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఈ డబ్బును స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు డబ్బు ను సీజ్ చేశారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలను సరిగ్గా చూపించిన కారణంగా సీజ్ చేసినట్లు తెలిపారు.

 వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి బంధువు ఇంట్లో నగదు .. అలెర్ట్ అయిన అధికారులు

వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి బంధువు ఇంట్లో నగదు .. అలెర్ట్ అయిన అధికారులు

డబ్బుతో పట్టుబడిన వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గం లోని గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన వైసిపి కార్పొరేటర్ అభ్యర్థికి సమీప బంధువు అని తెలుస్తుంది. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఈ నగదును తీసుకు వచ్చినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి ఎన్నికల ప్రలోభాల ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పంపిణీకి భారీగా లిక్కర్ , డబ్బు ... అడ్డుకునేందుకు అధికారుల యత్నం

పంపిణీకి భారీగా లిక్కర్ , డబ్బు ... అడ్డుకునేందుకు అధికారుల యత్నం

ఒక్క విజయవాడలోనే కాదు, విశాఖపట్నం లోనూ, గుంటూరులోనూ, ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల లోను ఎన్నికలను సీరియస్ గా భావిస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రలోభాల పర్వానికి తెర తీసి భారీగా లిక్కర్, డబ్బు పంపిణీకి సిద్ధమవుతున్నారు. ఇక అడ్డుకునే పనిలో పోలీసులు, ఎన్నికల అధికారులు ఉన్నారు.

English summary
In municipal elections leaders of the political parties are opening the door to temptations. The task force and election flying squad carried out raids with information that huge money were stored in a house under ajitsingh nagar police station limits . Rs 48.44 lakh was seized in these raids. officials said the documents related to the cash were shown incorrectly .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X