• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఉద్వేగం..క‌సి..ఆనందం..జ‌గ‌న్ క‌ళ్ల‌ల్లో క‌న్నీరు: విజ‌య‌మ్మ భావోద్వేగం: త‌ండ్రిని త‌ల్చుకోగానే..!

|
  ఉద్వేగం... క‌సి... ఆనందం... విజ‌య‌మ్మ భావోద్వేగం!! జ‌గ‌న్ క‌ళ్ల‌ల్లో క‌న్నీరు... | Oneindia Telugu

  వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనే నేను...అంటూ ప్ర‌మాణ స్వీకారం ప్రారంభించ‌గానే ఒక్క సారిగా ప్రాంగ‌ణంలో కేరింత‌లు .. చ‌ప్ప‌ట్ల‌..జ‌గ‌న్ అనుకూల నినాదాలు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ లో నియంత్రించుకుంటున్న ఉద్వేగం.. సాధించాన‌నే క‌సి..సీఎం అయ్యాన‌నే ఆనందం..ప‌డిన క‌ష్టాలు త‌ల‌చుకొని ఆపులేక పోయిన క‌న్నీరు..తండ్రి పేరు త‌ల‌వ‌గానే త‌ల్లి విజ‌య‌మ్మ కంట క‌న్నీరు..ఆనంద భాష్పాలు..ముఖ్య‌మంత్రి అయినా ఓ త‌ల్లి కుమారుడినే అంటూ ఓదార్పు. అక్క‌డ ఉన్న నేత‌లతో సహా..అభిమానులు సైతం ఒక్క సారిగా అంద‌రూ వారినే చూస్తూ ఉండి పోయారు..

  ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో...

  ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో...

  గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ రాగానే జ‌గ‌న్ చేత ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయించ‌టం మొద‌లు పెట్టారు. అంద‌రూ త‌న తండ్రి త‌ర‌హాలోనే ఇంటి పేరుతో స‌హా జ‌గ‌న్ చెబుతార‌ని భావించారు. అయితే, జ‌గ‌న్ మాత్రం కేవ‌లం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అనే నేను అంటూ ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ క‌ళ్ల‌ల్లో..గొంతులో..ముఖ‌ములో ఉద్వేగం క‌నిపించింది. క‌ష్టాల‌ను ఎదురు నిల‌బ‌డి సాధించని క‌సి క‌నిపించింది. క‌ష్టానికి ఫ‌లితం ల‌భించింద‌నే ఆనందం ఆవిష్కృత‌మైంది. కంటి నుండి బ‌య‌ట‌కు వ‌స్తున్న ఆనంద భాష్పాల‌ను నియంత్రించుకుంటూ జ‌గ‌న్ త‌న ప్ర‌మాణ స్వీకారాన్ని పూర్తి చేసారు. ఆ త‌రువాత త‌న ప్ర‌సంగం స‌మ‌యంలోనూ ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకున్నారు. చివ‌ర‌కు మాత్రం ఇక అపులేక పోయారు. త‌న తండ్రిని త‌ల‌చుకున్నారు. త‌ల్లికి పాదాభివంద‌నం అని చెబుతూ అప్ప‌టి వ‌ర‌కు నియంత్రించుకుంటూ వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌సంగం ముగింపులో ఒక్క సారిగా భావోద్వేగానికి గుర‌వుతూ క‌న్నీరు కార్చేసారు.

  విజ‌య‌మ్మ భావోద్వేగం..జ‌గ‌న్ ఓదార్పు..

  విజ‌య‌మ్మ భావోద్వేగం..జ‌గ‌న్ ఓదార్పు..

  త‌న కుమారుడుతో క‌లిసి ఇంటి నుండి త‌ల్లి విజ‌య‌మ్మ‌..కుటుంబ స‌భ్యులు క‌లిసి వ‌చ్చారు. జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార వేదిక వ‌ద్ద‌కు రాగానే త‌ల్లి విజ‌య‌మ్మ ముద్దాడార‌దు. ప్ర‌మాణ స్వీకారం ముగిసిన త‌రువాత జ‌గ‌న్ త‌న తల్లిని వేదిక మీద‌కు తీసుకొచ్చారు. త‌న ప‌క్క‌నే కూర్చోబెట్టుకున్నారు. త‌న కుమారుడు సీఎం అయిన సంద‌ర్భాన్ని విజ‌య‌మ్మ పూర్తిగా ఆస్వాదించారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌సంగం మొత్తం విన్నారు. జ‌గ‌న్ త‌న ప్ర‌సంగం చివ‌ర్లో.. ‘నన్ను దీవించిన రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవునికి, పైనున్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాధాభివందనం చేస్తున్నాన'ని తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలకు అభివాదం చేసిన వైఎస్‌ విజయమ్మ.. కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. తన తనయున్ని అక్కున చేర్చుకున్నారు. జ‌గ‌న్ సైతం త‌ల్లిని ఓదార్చారు. ప‌క్క‌నే ఉన్న కేసీఆర్‌..స్టాలిన్‌తో స‌హా అక్క‌డ ఉన్న వారంతా ఈ స‌న్నివేశం చూసి..ఆ కుటుంబం ప‌దేళ్లు గా ఎదుర్కొన్న ఇబ్బందులు..ప‌డిన కష్టాలు గుర్తు చేసుకున్నారు.

  జ‌గ‌న్ కుమార్తెలు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్..

  జ‌గ‌న్ కుమార్తెలు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్..

  జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి వ‌చ్చిన కుటుంబ స‌భ్యులు ఒక వేదిక మీద కూర్చున్నారు. జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి, సోద‌రి ష‌ర్మిళ‌. అనిల్‌తో స‌హా కుమార్తెలు హ‌ర్ష‌..వ‌ర్ష సైతం వ‌చ్చారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్..కేసీఆర్‌కు భార‌తి త‌న కుమార్తె ల‌ను ప‌రిచయం చేసారు. త‌న తండ్రి ప్ర‌మాణ స్వీకారం కోసం జ‌గ‌న్ కుమార్తె లండ‌న్ నుండి వ‌చ్చారు. ఇక‌, వేదిక మీద‌కు రాగానే విజ‌య‌మ్మ‌..ష‌ర్మిళ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారికి అభివాదం చేసారు.

  English summary
  AP new CM Jagan and his mother Vijayamma emotional at the swearing time. When Jagan mentioned his father name in his speech Vijayamma got emotional.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X