విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎదురు చూస్తున్న ప్రశ్నలు..! సప్త సముద్రాలు దాటి ఎప్పుడొస్తావు పవన్..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ కోసం ఎదురుచూస్తున్నAP ప్రజలు || AP Public Waiting For Questioning Voice Pawan Kalyan

అమరావతి/హైదరాబాద్ : ఏపిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపించి చాలా రోజులవుతోంది. ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు ఉంటే ప్రశ్నించి తీరుతామన్న గబ్బర్ సింగ్ ప్రభుత్వ విధానాలపై ఇంకా స్పందించడం మొదలు పెట్టలేదు. నిజానికి ఏపి లో జరుగుతున్న పరిణామాలపైన, పోలవరం, రాజదాని నిర్మాణం, బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలపై స్పందించే అవకాశం వచ్చినా జనసేనాని అంతంగా దృష్టి కేంద్రీకరించలేదు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా జరుగుతున్న రాజకీయ చర్చలపై కూడా జనసేనాని స్పందించ వచ్చు. శాసన సభలో ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి హావభాలపైన ఇప్పటికే జయప్రకాశ్ నారాయణ, సీపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించిన సందర్బాలు ఉన్నాయి. ఐతే జనసేనాని స్పందన వేవిద్యంగా ఉంటుంది కాబట్టి గబ్బర్ సింగ్ కురిపించే ప్రశ్నలకోసం ప్రజానికం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపి బీజేపిలోకి బ్రేక్ పడిన చేరికలు.. కాషాయాన్ని కాదంటున్న తమ్ముళ్లు..! కారణం అదేనా..? ఏపి బీజేపిలోకి బ్రేక్ పడిన చేరికలు.. కాషాయాన్ని కాదంటున్న తమ్ముళ్లు..! కారణం అదేనా..?

ప్రశ్నించే గొంతు కోసం ఏపి ప్రజల ఎదురుచూపు..! జనసేనానికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్న సేనలు..!!

ప్రశ్నించే గొంతు కోసం ఏపి ప్రజల ఎదురుచూపు..! జనసేనానికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్న సేనలు..!!

ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నించే గొంతుక‌న‌వుతా అన్న జనసేనాని పవన్ కళ్యాన్ ప్రజల మద్యకు వచ్చి చాలా రోజులవుతోంది. అదికారం ఉన్నా లేకున్నా, జ‌నం త‌ర‌పున నిల‌దీస్తాన‌న్న గబ్బర్ సింగ్ గ్రామస్తుకు కనిపించి చాలా రోజులవుతోంది. మ‌రి ఏపీలో టీడీపీ, వైసీపీ మ‌ద్య దాగుడుమూత‌లాట‌. బీజేపీ రాజ‌కీయ నాట‌కం, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చాటుమాటుగా చేస్తున్న రాచకీయం. వెర‌సి న‌లుగురి మ‌ధ్య ఏపీ రాజకీయాలు న‌లుగుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు స‌ర్కారులో గ‌ళ‌మెత్తిన నేత‌లంతా సైలెంట్ అయ్యారు.

ఏపి శాసన సభలో మాటల యుద్దం..! జనసేనకు ప్రశ్నించే అవకాశం ఇచ్చిన పార్టీలు..!!

ఏపి శాసన సభలో మాటల యుద్దం..! జనసేనకు ప్రశ్నించే అవకాశం ఇచ్చిన పార్టీలు..!!

మేధావులుగా ఏపీను ముందుండి న‌డుపుతామ‌ని గొప్ప‌లు చెప్పిన నాయ‌క‌గ‌ణం ఏనాడో తెర‌మ‌రుగైంది. జ‌గ‌న్‌, చంద్రబాబు మ‌ధ్య తాము చేరితే ఎక్క‌డ అన్యాయం అవుతామ‌నే భ‌యం కూడా నేత‌ల్లో ఉన్న‌ట్టుంది. చివ‌ర‌కు ఉండ‌వ‌ల్లి వంటి వారు కూడా మౌన‌మే శ‌ర‌ణ్య‌మ‌నుకున్నారు. జ‌గ‌న్ ధాటికి ఎందుకొచ్చిన తంటా అనేంత‌గా ఎర్ర‌ పార్టీలు కూడా తెర చాటుకు చేరాయి. ఇటువంటి వేళ పోల‌వ‌రం నిర్మాణం ఆగిపోయింది. రాజ‌ధాని ప‌నులు నిలిచిపోయాయి.

ఉత్కంఠగా మారిన పోలవరం, రాజధాని నిర్మాణం..! అడిగే వారు కావాలంటున్న ఏపి జనం..!!

ఉత్కంఠగా మారిన పోలవరం, రాజధాని నిర్మాణం..! అడిగే వారు కావాలంటున్న ఏపి జనం..!!

ఇప్పుడైనా జ‌న‌సేనాని ప‌వ‌న్ ఏదైనా స్పందిస్తార‌ని జ‌న‌సైనికులు ఆశ‌గా చూస్తున్నారు. క‌నీసం చినబాబు లోకేష్ తరహాలో ట్వీట్లు పెడ‌తారా అంటే అదీ లేద‌నే చెప్పాలి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప‌వ‌న్ ఎందుకో ముభావంగా ఉంటూ వ‌స్తున్నారు. మొన్న తానా స‌భ‌ల్లోనూ ఏవో ముక్త‌ స‌రిగా మాట్టాడారు. వాస్త‌వానికి ఏపీలో ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించే అవ‌కాశం జ‌న‌సేన‌కు వ‌చ్చింది. వైసీపీ త‌ప్ప‌ట‌డుగులు, తెలుగుదేశం పార్టీ అయోమయంలోంచి పుట్టిన చేత‌గానిత‌నం.. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల్లో ఒకింత అస‌హ‌నం పెంచుతున్నాయి.

బడ్జెట్ లో కేటాయింపులు గందరగోళం..! పవన్ ప్రశ్నించాలంటున్న సైనికులు..!!

బడ్జెట్ లో కేటాయింపులు గందరగోళం..! పవన్ ప్రశ్నించాలంటున్న సైనికులు..!!

ఇటువంటి వేళ ప‌వ‌న్ గ‌ట్టిగా నిల‌బ‌డితే గ్రౌండ్‌లెవ‌ల్లో పార్టీ కేడ‌ర్‌లో ఉత్సాహం వ‌చ్చే అవ‌కాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. అసలు నామమాత్రంగా ఉండే బీజేపీ నేత‌లు అపుడ‌పుడు ప్రెస్‌మీట్లు పెట్టి విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. క‌నీసం.. ఆ ద‌శ‌గా అయినా ప‌వ‌న్ మేల్కొంటే భ‌విష్య‌త్ ఆశాజ‌నకంగా ఉంటుంద‌నేది జ‌న‌సైనికుల సూచ‌న‌. మ‌రి.. ఈ అంశాలపై కాటమ రాయుడు ఎప్పుడు దృష్టి సారిస్తారని ఏపిలో ప్రజల మద్య చర్చ జరుగుతోంది.

English summary
It has been several days since Janasena chief Pawan Kalyan's appearance in AP. Gabbar Singh has not yet begun to respond to government policies, asking if there are government policies against the public. In fact, Janasena was not so keen on responding to the developments in AP, Polavaram, Rajdhani and budget allocations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X