• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రిటైర్మెంట్‌- రాజకీయాల్లోకి నో- ఓటు కోసం ఇంకా పోరాటం

|

ఏపీలో ఏడాది క్రితం స్ధానిక ఎన్నికల నిర్వహణ, వాయిదా, తాజాగా తిరిగి నిర్వహణతో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పదవీ విరమణ చేశారు. ఎన్నికల నిర్వహణలో కొన్ని లోటుపాట్లు ఎదురైనా అంతిమంగా సంతృప్తి కరంగా ఈ ప్రక్రియ ముగించినట్లు ఆయన వెల్లడించారు. అంతే కాదు హైకోర్టు సూచన మేరకు ఎన్నికల సంస్కరణలపై ఓ నివేదికను తయారు చేసి గవర్నర్‌తో పాటు రాజకీయ పార్టీలకు పంపారు. వ్యక్తిగతంగా తన ఓటు హక్కు కోసం పోరాటం కూడా కొనసాగిస్తానని ప్రకటించారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రిటైర్మెంట్‌

ఎస్ఈసీ నిమ్మగడ్డ రిటైర్మెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ పదవీ విరమణ చేశారు. తన ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ఇవాళ ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. చివరి రోజు తన పదవీ కాలంలో చేపట్టిన పలు ఎన్నికలు, ఇతర కార్యక్రమాల్ని ఆయన మీడియాతో పంచుకున్నారు. రాష్టంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడం సంతోషాన్నిచ్చిందని నిమ్మగడ్డ తెలిపారు. రీపోల్‌కు అవసరం లేకుండా ఎన్నికలు జరపడం వెనుక ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందన్నారు.

 జగన్ సర్కార్‌ సహకారం మరువలేనన్న నిమ్మగడ్డ

జగన్ సర్కార్‌ సహకారం మరువలేనన్న నిమ్మగడ్డ

ఏపీలో వరుస ఎన్నికల వెనుక ప్రభుత్వం, ఉద్యోగుల సహకారం ఉందని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. ప్రభుత్వ సహకారం లేకుండా స్ధానిక ఎన్నికలు జరిగేవి కావని తెలిపారు. సీఎస్, డీజీపీతో పాటు ప్రభుత్వ పెద్దల నుంచి పూర్తి సహకారం లభించిందని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ చర్యలతో కమిషన్ ఎంతో బలోపేతం అయిందన్నారు.వ్యక్తుల అనాలోచిత చర్యల వల్ల వ్యవస్ధల మధ్య అంతరాలు పెరిగాయని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికలకు ముందు కొందరు ఎస్ఈసీలో సిబ్బందిని సెలవుపై పంపాలని ప్రయత్నించారని, ఇందులో ప్రభుత్వం పాత్ర లేదన్నారు.

 ఓటుపై అవసరమైతే హైకోర్టుకు వెళ్తా

ఓటుపై అవసరమైతే హైకోర్టుకు వెళ్తా

తెలంగాణలో ఉన్న తన ఓటు హక్కును ఏపీలో స్వగ్రామానికి మార్చుకోవాలని భావించినట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఇందులో తప్పేమీ లేదన్నారు. ఇందులో తప్పేమీ లేదన్నారు. కానీ దీన్ని నిరాకరించడం ద్వారా అపోహలను పెంచాలని కొందరు ప్రయత్నించారని నిమ్మగడ్డ తెలిపారు. ఇలాంటి అగాధాలను తాను కోరుకోలేదన్నారు. పదవిలో ఉండగా వీటిపై మాట్లాడటం సరికాదని భావించానని. పదవి నుంచి తప్పుకున్నాను కాబట్టి ఇప్పుడు హైకోర్టుకు వెళ్లి దీనిపై పోరాడతానన్నారు.

ఎన్నికల సంస్కరలణపై నిమ్మగడ్డ రిపోర్ట్‌

ఎన్నికల సంస్కరలణపై నిమ్మగడ్డ రిపోర్ట్‌

కోర్టులు ప్రజాప్రయోజన వాజ్యాల విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాయని,. అదే సమయంలో మీకున్న అనుభవంతో ఎన్నికల సంస్కరలపై ఓ నివేదిక ఇవ్వాలని సూచించాయని నిమ్మగడ్డ తెలిపారు. దీంతో తాను ఇదే విషయంపై నివేదిక తయారు చేశానన్నారు.. ఎన్నికల కమిషన్‌ పరిమిత వ్యవస్ద. మిగతా వ్యవస్ధలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని,. ఎన్నికల కమిషన్ స్వతంత్రత పరిధిలోకి లోబడే తన అధికారాలు వాడినట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఇతర వ్యవస్ధల్లోకి చొరబడలేదన్నారు. మిగతా వ్యవస్ధలపై గౌరవమే చూపానన్నారు.. చట్ట సభల్ని, గవర్నర్‌నూ, కోర్టుల్ని సైతం గౌరవించాను. గవర్నర్‌ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో నాకు వ్యవస్ధలపై అపార గౌరవం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియలో లోటుపాట్లు ఎదురైనప్పుడు, అభ్యర్ధుల ఓట్లు హరించే సందర్భం వచ్చినప్పుడు వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నించాని నిమ్మగడ్డ తెలిపారు. అయినా విస్తృత అధికారాలు ఎక్కడా వాడలేదన్నారు.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మంచి పద్దతి ఉంది. వారి నుంచి వాటిని తీసుకుని క్రోడీకరించిన సలహాలతో ఓ సంస్కరణల రిపోర్ట్ తయారు చేసినట్లు ఆయన తెలిపారు. గవర్నర్‌కు ఇద్దామనుకుంటే ఆయన వ్యాక్సినేషన్‌ వేయించుకునే పనిలో ఉన్నారని, దీంతో రాజ్‌భవన్‌కూ, రాజకీయ పార్టీలకు కూడా ఈ సంస్కరణల నివేదిక పంపించానన్నారు.

రాజకీయాల్లోకి నో - ఆ పొరబాటు చేయనన్న నిమ్మగడ్డ

రాజకీయాల్లోకి నో - ఆ పొరబాటు చేయనన్న నిమ్మగడ్డ


ఎస్ఈసీగా బాధ్యతలు పూర్తి చేసుకుని రిటైర్‌ అవుతున్న వేళ భవిష్యత్‌ కార్యాచరణపై అడిగిన ప్రశ్నకు నిమ్మగడ్డ నేరుగా స్పందించలేదు. అయితే రాజకీయాల్లోకి మాత్రం వచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో నిమ్మగడ్డ రాజకీయ ప్రవేశంపై వచ్చిన ఊహాగానాలకు ఆయన చెక్‌ పెట్టినట్లయింది. స్ధానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు, మంత్రులు నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఆయన ఎస్ఈగా రిటైర్‌ అయ్యాక టీడీపీలో చేరిపోతారంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు నిమ్మగడ్డ ఆ ఊహాగానాలకు చెక్‌ పెట్టారు. నేను పాలిటిక్స్‌లో చేరను, ఆ పొరబాటు మాత్రం చేయనని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు.

English summary
andhra pradesh sec nimmagadda ramesh kumar has made some interesting comments on his retirement day i.e. today. he expressed his happiness over his tenure and holding local body polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X