విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ నిర్ణయాల్లో కోర్టుల జోక్యంపై తమ్మినేని సీరియస్- తెరపైకి టీడీపీ రూలింగ్, గత తీర్పులు..

|
Google Oneindia TeluguNews

ఏపీ చట్ట సభల వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై స్పీకర్ తమ్మినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఇదే విషయంపై కోర్టులు ఇచ్చిన తీర్పులను, మాజీ స్పీకర్ యనమల ఇచ్చిన రూలింగ్ ను తమ్మినేని గుర్తు చేశారు.

స్పీకర్‌గా ఏడాది కాలం సంతృప్తి..

స్పీకర్‌గా ఏడాది కాలం సంతృప్తి..

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఏడాది కాలం పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని తమ్మినేని సీతారాం తెలిపారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన సీతారాం పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఏడాదిలో ప్రభుత్వం 52 చారిత్ర బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిందని స్పీకర్ గుర్తుచేశారు. చాలా సందర్భాల్లో సంక్లిష్ట పరిస్ధితులు ఎదురైనా దాన్ని అధిగమించామని తమ్మినేని పేర్కొన్నారు. ఏపీ మూడు రాజధానులకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా 11 గంటల చర్చ జరిగిందని, ఇందులో వైసీపీ నాలుగు గంటలు మాట్లాడితే విపక్షానికి 2 గంటల 17 నిమిషాలు ఇచ్చామని స్పీకర్ తెలిపారు. అయినా అసెంబ్లీలో చర్చ సరిగా జరగలేదని విమర్శించడం తగదన్నారు.

మండలికి మంత్రులను రానీయరా ?

మండలికి మంత్రులను రానీయరా ?

శాసనమండలికి మంత్రులు కీలకమైన బిల్లుల ఆమోదం కోసం వెళ్తారని, కానీ ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులను మండలికి రాకూడదని కొందరు వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసమని తమ్మినేని ప్రశ్నించారు. రాజధాని బిల్లుల ఆమోదం సందర్భంగా అసెంబ్లీ నుంచి మండలికి వెళ్లిన మంత్రులకు ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో తమ్మినేని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజధాని బిల్లులు ప్రవేశపెట్టేందుకు గతంలో ఓసారి మంత్రులు వెళ్లినప్పుడు ఛైర్మన్ అడ్డుకుని వాటిని సెలక్ట్‌ కమిటీకి పంపారు. రెండోసారి బిల్లులు ప్రవేశపెట్టేందుకు అవకాశమే ఇవ్వలేదు.

రాజధానిపై కోర్టులను తప్పుడు సమాచారం..

రాజధానిపై కోర్టులను తప్పుడు సమాచారం..

ఏపీ రాజధాని వ్యవహారానికి సంబంధించి కోర్టులకు కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని స్పీకర్ తమ్మినేని ఆక్షేపించారు. అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించిన బిల్లులు ఇంకా సెలక్ట్‌ కమిటీ వద్దే ఉన్నాయంటూ కోర్టులకు చెప్తున్నారని తమ్మినేని ఆరోపించారు. అసలు సెలక్ట్‌ కమిటీయే ఏర్పాటు కానప్పుడు బిల్లులు పెండింగ్ లో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. సెలక్ట్ కమిటీ వేయలేదు అసెంబ్లీ కార్యదర్శిపై చర్య తీసుకోమని ఇక్కడ చెబుతారని, మరోవైపు కోర్టుల్లో సెలక్ట్ కమిటీ వద్ద బిల్లులు ఉన్నయంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపమని అసెంబ్లీలో చంద్రబాబు అడకుండా, మండలిలో కోరడం వెనుక ఉద్దేశమేంటని తమ్మినేని ప్రశ్నించారు.

కోర్టుల జోక్యంపై రూలింగ్ ఇచ్చింది మీరే...

కోర్టుల జోక్యంపై రూలింగ్ ఇచ్చింది మీరే...


శాసనసభ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం చేసుకునేందుకు వీల్లేదని 1997లో అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు ఇచ్చిన రూలింగ్ ఇప్పటికీ అమల్లోనే ఉందని స్పీకర్ తమ్మినేని గుర్తుచేశారు. అదే యనమల ఇప్పుడు శాసనసభ నిర్ణయాలపై కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని తమ్మినేని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లడం దేశంలో ప్రజలందరికీ ఉన్న హక్కు అని, అయితే అప్పుడు యనమల ఇచ్చిన రూలింగ్ ను ఇప్పుడు ఏం చేయమంటారని టీడీపీని స్పీకర్ ప్రశ్నించారు. కోర్టులు శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని నిన్న కేంద్రమే చెప్పందని ఆయన గుర్తు చేశారు.

Recommended Video

AP Colleges To Reopen From October 15 | Assistant Professors Recruitment : AP CM YS Jagan
 కోర్టులే తీర్పులు చెప్పాయి...

కోర్టులే తీర్పులు చెప్పాయి...

చట్టసభల వ్యవహారాల్లో కోర్టుల జోక్యం ఉండరాదని సుప్రీంకోర్టు సహా అనేక కోర్టులు తీర్పులిచ్చాయని, ఎవరి స్వయం ప్రతిపత్తి వారికి ఉంటుందని స్పీకర్ తమ్మినేని గుర్తుచేశారు. చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నించడానికి వీల్లేదని రాజారామ్ వర్సెస్ లోక్ సభ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని స్పీకర్ తెలిపారు. ఒక వేళ ప్రొసీజర్ లోపాలున్నా ప్రశ్నించకూడదాని ఆ తీర్పులో ఉందన్నారు. ఏ వ్యవస్ధ అయినా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుందని, గవర్నర్ ఎంతో మంది న్యాయనిపుణులతో చర్చించాకే రాజ్యాంగబద్ధమైన నిర్ణయానికి ఆమోదముద్ర వేశారని గుర్తుచేశారు. త్వరలో ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సు పెట్టాలని నిర్ణయించినట్లు తమ్మినేని తెలిపారు.

English summary
andhra pradesh legislative assembly speaker tammineni sitaram has expressed his displesure over courts intervention in assembly proceedings. he reiterate previous judgements and former speaker yanamala ramakrishnudu's ruling in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X