విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో స్థానంలో ఏపీ: పాముకాటుకు మృతి చెందుతున్నది ఎక్కువగా కృష్ణా జిల్లా వాసులే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: పాము కాటు కారణంగా మరణించిన వారి సంఖ్య అధికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాము కాటుద్వారా మరణించిన వారి సంఖ్యను పరిశీలిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఏపీలో మొత్తం 25,965 మంది పాముకాటుకు గురికాగా అందులో 117 మంది మృతి చెందినట్లు సమచారం. ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 36,229 పాము కాటు కేసులు నమోదు కాగా అందులో 203 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదుల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది.

కృష్ణా జిల్లాలో మరణాల సంఖ్య ఎక్కువే

కృష్ణా జిల్లాలో మరణాల సంఖ్య ఎక్కువే

2008 నుంచి 2012 వరకు పాము కాటు కేసులను పరిశీలించగా మరణ నిష్పత్తి ఇద్దరు పురుషులకు ఒక మహిళగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అధిక శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటారు. అయితే నిపుణులు స్టడీ చేయగా ఎక్కువ మరణాలు కృష్ణా జిల్లా నుంచే సంభవించినట్లు చెప్పారు. ఇక మారుతున్న కాలంలో ఎక్కువగా పట్టణీకీకరణ జరుగుతుండటం వల్ల ఎక్కడికక్కడికి చెట్లు కొట్టేయడం, అడవులు కూడా మాయమవుతుండటంతో పాములు కొత్త ప్రాంతాలకు తరలిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాంతాల్లోని ఇళ్లల్లో నివాసాల్లో ఈ పాములు చేరిపోతున్నాయని ఇక్కడే మనిషికి పాముకు మధ్య ఒక వైరుధ్యం నెలకొందని చెబుతున్నారు.

వాతావరణ మార్పులతో గందరగోళానికి గురయ్యే పాములు

వాతావరణ మార్పులతో గందరగోళానికి గురయ్యే పాములు

కొన్ని సార్లు వాతావరణంలోని మార్పులు కూడా పాములను గందరగోళానికి గురిచేస్తాయి. పాములు వాతావరణంకు అనుకూలంగా తమ జీవ ప్రక్రియను ప్లాన్ చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు వేసవి కాలంకు ముందు పాములు మేటింగ్‌కు దిగుతాయి. వర్షాకాలం వచ్చేసరికి గుడ్లు పెడుతాయి. ఇది పాములకు సరైన సమయం మని నిపుణులు చెబుతున్నారు. అదే ఉన్నఫలంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటే ఉన్న చోట నుంచి మరో చోటికి పాములు వెళతాయని ఈ క్రమంలోనే గందరగోళానికి గురవుతాయని చెబుతున్నారు. ఈఇలాంటి సమయంలో మనిషి ఎదురైతే వెంటనే కాటేస్తాయని చెబుతున్నారు.

 పాము కాటుకు విరుగుడు మందు హాస్పిటల్స్‌లో ఉంది

పాము కాటుకు విరుగుడు మందు హాస్పిటల్స్‌లో ఉంది


మనిషి పాము కాటుకు గురైతే చికిత్స కోసం వెంటనే హాస్పిటల్‌కు వెళ్లిన సందర్భాలు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. వారు అవగాహన లేకుండా వ్యవహరించడం లేదా ప్రభుత్వ హాస్పిటల్స్‌పై నమ్మకం కోల్పోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. పాము కాటుకు పాము విషమే విరుగుడని చెప్పిన నిపుణులు అది ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఉందని వెల్లడించారు. పాము కాటుకు గురై అది విషపూరితమైనదని తెలుసుకుని హాస్పిటల్‌కు చేరుకునేలోగా మృతి చెందుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఇక తెలంగాణలో గత మూడేళ్లలో గణాంకాలు తీసుకుంటే పాము కాటుకు చనిపోయిన వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2016లో పాముకాటుకు 96 మంది మృతి చెందితే... 2018 ముగిసే సరికి కేవలం 9 మంది మాత్రమే మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి.

English summary
Andhra Pradesh has the second highest rate of death due to snake bite in India. According to the Ministry of Health and Family Wefare, the state witnessed 25,965 cases of snake bite in which as many as 117 people succumbed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X