విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపిలో ఉద్యోగాల జాత‌ర : నేడు రెండు నోటిఫికేష‌న్లు..త్వ‌ర‌లో మ‌రో నాలుగు..

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఉద్యోగాల భ‌ర్తీ కోసం వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు నోటిఫికేష‌న్లు జారీ చేసిన ఏపిపిఎస్సీ ఈ రోజు మ‌రో రెండు నోటిఫికేష‌న్ల విడుద‌లకు రంగం సిద్దం చేస్తోంది. ఈ నోటిఫికేష‌న్ల ద్వారా 649 గ్రూప్ -2 పోస్టుల భ‌ర్తీకి తొలి అడుగు వేయ‌నుంది. త్వ‌రలోనే గ్రూపు-1 నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నుంది..

ఏపిలో ప‌లు ప్ర‌భుత్వ విభాగాల్లో ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఏపిపిఎస్సీ ఈ రోజు రెండు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌నుంది. గ్రూప‌-2 స‌ర్వీసు నోటిఫికేష‌న్‌.. దాదాపు 200 పైగా పోస్టుల‌తో జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేందుకు రంగం సిద్దం చేసారు.

APPSC planned to Release 10 Notifications shortly..

సెప్టెంబ‌ర్ 19 ప్ర‌భుత్వ నిర్ణ‌యం మేర‌కు పోస్టుల భ‌ర్తీకి ఆర్దిక శాఖ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఆ త‌రువాత ఏపిపిఎస్సీ ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 10 నోటిఫికేష‌న్లు జారీ చేసింది. ఈ నెలాఖ‌రులోగా మ‌రో 15 నోటిఫికేష‌న్లు జారీ చేస్తామ ని ఏపిపిఎస్సీ ఛైర్మ‌న్ పిన్న‌మ‌నేని ఉద‌య‌భాస్క‌ర్ ప్ర‌క‌టించారు. ఇక‌, రానున్న నాలుగు రోజుల్లో గ్రూపు-1 స‌ర్వీసు, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్లు, ఇత‌ర ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌ల ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని ఛైర్మ‌న్ స్ప‌ష్టం చేసారు.

13 పోస్టులు : 3 నోటిఫికేష‌న్లు: విడుద‌ల చేసిన ఏపిపిఎస్సీ.. 13 పోస్టులు : 3 నోటిఫికేష‌న్లు: విడుద‌ల చేసిన ఏపిపిఎస్సీ..

ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌టంతో ప్ర‌భుత్వం సైతం ఉద్యోగాల భ‌ర్తీ నోటిఫికేష‌న్లు త్వ‌రిత‌గ‌తిన ఇవ్వాల‌ని ఏపిపిఎస్సీని ఆదే శించింది. ప్ర‌భుత్వ శాఖల్లో ఖాళీలు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించింది. ఇందులో భాగంగా నోటిఫికేష‌న్లును జారీ చేస్తున్నారు. ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చేలోగానే నోటిఫికేష‌న్ల ప్ర‌క్రియ పూర్తి చేస్తే..ఆ త‌రువాత ప్ర‌క్రియ కొన‌సాగింపుకు ఎటు వంటి ఇబ్బంది ఉండ‌ద‌ని ఏపిపిఎస్సీ అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

English summary
APPSC releasing two notifications on Friday. Shortly another 10 notifications may release. APPSC Planning to complete vacancies filling before election code.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X