విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఐటీ విద్యార్ధులకు గుడ్ న్యూస్- క్లౌడ్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఉచిత శిక్షణ....

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఐటీ విద్యార్ధులకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగవకాశాలు అధికంగా ఉన్న కోర్సులను గుర్తించి వాటిలో శిక్షణ ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రెండు హాట్ కేక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ కోర్సులు చదువుతున్న విద్యార్ధులు స్కిల్ కార్పోరేషన్ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకుంటే వారికి ఆన్ లైన్ శిక్షణ అందించేందుకు సిద్దమని ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి), ఐడిఎస్ ఇన్‌ కార్పోరేషన్ ఆధ్వర్యంలో క్లౌడ్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్టు ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ ప్రకటించారు. లింక్డిన్ రీసెర్చ్ ప్రకారం మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ మొదటి స్థానం, క్లౌడ్ ఆర్కిటెక్ట్ రెండో స్థానంలో ఉన్నాయని.. ఇలాంటి డిమాండ్ ఉన్న కోర్సుల్లో మన యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మరింత సులువుగా పొందే అవకాశం ఉంటుందన్నారు.

apssdc offer online free cloud architect and blackchain technology courses for it students

ఏపీ స్కిల్ కార్పోరేషన్ అమెజాన్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రోగ్రామ్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఈనెల 10వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభిస్తోంది. అమెజాన్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రోగ్రామ్ 36 గంటలు, బ్లాక్ చైన్ టెక్నాలజీపై 40ల గంటలపాటు ఆన్ లైన్ శిక్షణ ఇస్తారు. క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రోగ్రామ్ నేర్చుకునేందుకు సీఎస్ఈ, ఐటీ, ఈసీఈలో ఎంటెక్, బీటెక్ పాసైనవారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ లో ఆన్ లైన్ శిక్షణ కోసం సీఎస్ఈ, ఐటీ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులు.

apssdc offer online free cloud architect and blackchain technology courses for it students

ఆసక్తి ఉన్నవారు ఈనెల 9వ తేదీ సాయంత్రంలోపు www.apssdc.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ప్రొఫెసర్ డి.వి.రామకోటి రెడ్డి తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలకు ఎపిఎస్‌ఎస్‌డిసి టోల్ ఫ్రీ నంబర్ 18004252422కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

English summary
andhra pradesh skill development corporation announced to give online training in cloud architect and blackchain technology for IT students in the state from august 10th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X