విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపిలో అస‌ద్ కార్యాచ‌ర‌ణ షురూ : జ‌గ‌న్ కు క‌లిసొచ్చేనా : చ‌ంద్ర‌బాబు రివ‌ర్స్ ప్లాన్‌..!

|
Google Oneindia TeluguNews

ఊహించిందే జ‌రుగుతోంది. చెప్పిందే చేస్తున్నారు. ఏపి రాజ‌కీయాల్లోకి ఎంఐఎం. ఏపిలోని ఎంఐఎం నేత‌ల‌కు అధినేత నుండి ఫోన్లు. కార్యాచ‌ర‌ణ సిద్దం చేయాల‌ని సూచ‌న‌లు. త్వ‌ర‌లోనే ఏపి ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని వెల్ల‌డి. స‌భ‌లు..స‌మావే శాల‌కు సిద్దం కావాల‌ని ఆదేశం. జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిస్తామ‌ని గ‌తంలో అస‌ద్ ప్ర‌క‌ట‌న‌. తాజాగా ఎంఐఎం ఎంట్రీతో ఏపిలోని మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎటువైపు మ‌ళ్లుతుంద‌నేది అస‌లు చ‌ర్చ‌. మ‌రి..అస‌ద్ నిజంగానే వైసిపి కి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తార‌నే అంచ‌నాలో..టిడిపి అధినేత చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్న రివ‌ర్స్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా..

ఏపి రాజ‌కీయాల్లో ఎంఐఎం..కీల‌క సూచ‌న‌లు..

ఏపి రాజ‌కీయాల్లో ఎంఐఎం..కీల‌క సూచ‌న‌లు..

తెలంగాణ ఎన్నిక‌ల్లో టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎంఐఎం కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసారు. ఎంఐఎం అభ్య‌ర్ధి పై టిడిపి అభ్య‌ర్దిని బ‌రిలోకి దింపారు. దీంతో..తెలంగాణ ఎన్నిక‌ల త‌రువాత ఏపిలో చంద్ర‌బాబు ను టిఆర్‌య‌స్ తో పాటు గా ఎంఐఎం రాజ‌కీయ ల‌క్ష్యంగా మార్చుకున్నారు. అందులో భాగంగా..ఏపిలో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని..చంద్ర‌బాబు ను ఓడిస్తామ‌ని ఎఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓపెన్‌గానే ప్ర‌క‌టించారు.

ఇక‌, ఇప్పుడు దీనికి త‌గిన‌ట్లుగానే ఏపిలో పావు లు క‌దిపుతున్నారు. ఏపిలో 2014 ఎన్నిక‌ల ముందు నుండి స్త‌బ్దుత‌గా ఉన్న ఎంఐఎం నేత‌ల‌కు ఆ పార్టీ ముఖ్య కార్యాల యం నుండి ఫోన్లు వ‌చ్చాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఏపి లో పార్టీ ముఖ్య‌నేత‌ల ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయ‌ని చెప్పారు. దీనికి త‌గిన‌ట్లుగా జ‌న స‌మీక‌ర‌ణ‌..పార్టీ అమ‌లు చేయాల్సిన కార్యాచ‌ర‌ణ పై దృష్టి పెట్టాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా ఏపిలోని మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క వ‌ర్గాలను ఫోక‌స్ చేస్తున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే ఎంఐఎం నేత‌లు ఏపిలో స‌న్నాహ‌క స‌మావేశాలు నిర్వ‌హిస్తార‌ని స‌మాచారం.

వెన‌క్కు త‌గ్గిన కేంద్రం : ఆంక్ష‌లు ఎత్తివేత : బాబు దావోస్ ప‌ర్య‌ట‌న కు అనుమ‌తి ..! వెన‌క్కు త‌గ్గిన కేంద్రం : ఆంక్ష‌లు ఎత్తివేత : బాబు దావోస్ ప‌ర్య‌ట‌న కు అనుమ‌తి ..!

అస‌ద్ శ‌ప‌ధం... జ‌గ‌న్ కు క‌లిసొచ్చేనా..

అస‌ద్ శ‌ప‌ధం... జ‌గ‌న్ కు క‌లిసొచ్చేనా..

చంద్ర‌బాబు ను ఏపిలో ఓడిస్తాన‌ని అస‌ద్ శ‌ప‌ధం చేసారు. అదే స‌మ‌యంలో త‌న మిత్రుడు జ‌గ‌న్ ను గెలుస్తార‌ని అస‌ద్ ధీమా వ్య‌క్తం చేసారు. ఇప్పుడు ఎంఐఎం వేస్తున్న అడుగులు చూస్తున్న త‌రువాత‌..అస‌లు ఏపి లో అస‌ద్ ప్ర భావం ఎంత మేర ఉంటుంద‌నే చ‌ర్చ మొదలైంది. ఏపిలోని క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, గుంటూరు, విజ‌య‌వాడ ల్లో మైనార్టీ ఓట్ బ్యాంక్ గ‌ణ‌నీయంగా ఉంది. జాతీమ స్థాయిలో మైనార్టీ హ‌క్కుల గురించి పోరాడే పార్టీగా ఎంఐఎం కు గుర్తింపు ఉంది.

వైయ‌స్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో మైనార్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌టం ద్వారా..ఎంఐఎం నాటి నుండి వైయ‌స్ కుటుంబానికి ద‌గ్గ‌రైంది. ఇప్పుడు ఏపిలో చంద్ర‌బాబు పై జ‌గ‌న్ పోరాడుతున్న స‌మ‌యంలో.. ఏపి లోని మైనార్టీల మ‌ద్ద‌తు జ‌గ‌న్ ద‌క్కేలా చూడాల‌నేది ఎంఐఎం వ్యూహం. గ‌త ఎన్నిక‌ల్లో మైనార్టీలు వైసిపి వైపే నిలిచిన ట్లుగా ఫలితాల స‌ర‌ళి స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికీ..మైనార్టీల మ‌ద్ద‌తు జ‌గ‌న్ కు ఉంటుంద‌ని వైసిపి నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల ముందు హ‌డావుడి మిన‌హా..మైనార్టీల‌కు టిడిపి చేసింది ఏమీ లేద‌నేది వారి వాద‌న‌. అస‌ద్ వ్యూహం ఎలా ఉంటుందో తెలిసిన త‌రువాత‌నే స్పందిస్తామ‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు..

ఎంఐఎం ఎంట్రీ...చంద్ర‌బాబు రివ‌ర్స్ ప్లాన్‌..

ఎంఐఎం ఎంట్రీ...చంద్ర‌బాబు రివ‌ర్స్ ప్లాన్‌..

ఏపిలో ఎంఐఎం మైనార్టీల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేసినా..జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని కోరినా..త‌మ‌కు న‌ష్టం ఉండద‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. ఇప్ప‌టికే తాము బిజెపి పై పోరాడుతున్న పార్టీగా మైనార్టీలు గుర్తించార‌ని.. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ బిజెపికి అనుకూలంగా ఉన్నార‌నే విష‌యాన్ని తాము బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లామ‌ని.. ప్ర‌త్యే కించి మైనార్టీల్లో ఇది త‌మ‌కు మేలు చేస్తుంద‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. తాజాగా మైనార్టీకి మంత్రి ప‌ద‌వి..

మైనార్టీ నేత‌కు మండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వి..మైనార్ట‌ల‌కు రంజాన్ తోఫా..మ‌సీదుల‌కు నిధులు..ఇమాం ల‌కు గౌర‌వ వేత‌నం వంటివి మైనార్టీ ఓట్ బ్యాంక్ ను టిడిపి కి అనుకూలంగా మారుస్తుంద‌ని టిడిపి నేత‌లు ధీమాగా ఉన్నారు. గ‌తంలో ఏపి లో పోటీ చేసిన ఎంఐఎం టిడిపి మీద పోటీ చేసి ఎటువంటి ప్ర‌భావం చూపించ‌లేక పోయింద‌ని టిడిపి మైనార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఎంఐఎం హైద‌రాబాద్ న‌గ‌రానికే ప‌రిమ‌త‌మైన పార్టీ..ఏపిలో ప్ర‌భావం చూపించ‌లేద‌ని టిడిపి నేత‌ల లు గ‌ట్టిగా చెబుతున్నారు. అస‌ద్ వ్యూహాల‌కు అనుగుణంగా త‌మ ప్ర‌తి వ్యూహాలు ఉంటాయ‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు.

English summary
AIMIM planning to entry in AP Politics against TDP. MIM Chief Asad already announced support for Jagan in AP Politics. TDP also preparing for facing Asad in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X