జగన్ అవినీతి రాజ్యానికి రాజు: మీ కోరిక అదేనా: ఎమ్మెల్సీ అశోక్‌బాబు సంచలన వ్యాఖ్యలు..!
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్‌ను అవినీతి రాజ్యానికి రాజుగా అభివర్ణించారు. హౌసింగ్ విషయంలో జగన్ విచారణకు ఆదేశించటం.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ఆదేశించటం పైన అశోక్‌బాబు స్పందించారు. షేర్ వాల్ టెక్నాలజీ గురించి ముఖ్యమంత్రి అభ్యంతరం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. పేదలు నూతన ఇళ్లళ్లో ఉండకూడదా అని మీ ఆలోచనా అంటూ నిలదీసారు, వైయస్ హయాంలో జరిగిన అవీనితి పైనా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసారు.
అవినీతి రాజ్యానికి జగన్ రారాజు..
ముఖ్యమంత్రి జగన్ పైన ఇటీవల కాలంలోనే కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అవినీతి ఆరోపణలు చేసారు. అవినీతి రాజ్యానికి జగన్ రాజు అని ఆరోపించారు. అవినీతి గురించి వైసీపీ వాళ్లు మాట్లాడటం హాస్యాస్పదం అంటూ కామెంట్ చేసారు. గృహనిర్మాణంలో జరిగిన అవినీతి కారణంగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీని మీద అశోక్‌బాబు స్పందించారు. హౌసింగ్ విషయంలో షేర్వాల్ టెక్నాలజీ సరై నది కాదని వైసీపీ చెప్పగలదా అని అశోక్‌బాబు స్పందించారు. పేదలు పురాతన ఇళ్లల్లోనే ఉండాలని జగన్ కోరుకుం టున్నారా అని ప్రశ్నించిన అశోక్‌బాబు నూతన ఇళ్లళ్లో పేదవారు ఉండకూడదా అని నిలదీసారు. పేదవాళ్లను చులక నగా చూడొద్దని సూచించారు. అదే విధంగా రాజీవ్ గృహాకల్పపై కూడా విచారణ చేస్తే బాగుంటుంది. 2004 నుంచి 2019 వరకు విచారణ చేస్తే స్వాగతిస్తామని అశోక్ బాబు చెప్పుకొచ్చారు.


గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు..
అశోక్‌బాబు ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్న సమయం నుండి నాటి సీఎం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిం చారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నాటకలో బీజేపీ వ్యతిరేక ప్రచారంలో ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉంటూనే ప్రచారం చేసారు. ఇక, ఉద్యోగానికి రాజీనామా చేయకముందే ఆయన్ను టీడీపీలోకి రావాలంటూ చంద్రబాబు ఆహ్వానించారు. ఇక అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటాన్ని టీడీపీలోని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇక, తాజాగా ఓ టీవీ చర్చల్లో జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లకే ఓటు వేస్తామని ప్రజలు నిరూపించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దీని పైన పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీగా అధికార పార్టీ పైన విమర్శలు కొనసాగిస్తున్నారు.