విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అటెండెన్స్.. జగన్ షాకింగ్ డెసిషన్

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసిపి ఎమ్మెల్యేలకు, మంత్రులకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అటెండెన్స్ వేయాలని షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు ఇక ఈ బాధ్యతను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కి అప్పగించారు.

ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలతో ఏపీ అసెంబ్లీలో రచ్చ .. టీడీపీ నేతలపై స్పీకర్ ఆగ్రహం ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలతో ఏపీ అసెంబ్లీలో రచ్చ .. టీడీపీ నేతలపై స్పీకర్ ఆగ్రహం

 ప్రతిపక్ష టీడీపీ పై మరింత దూకుడుగా వ్యవహరించాలని జగన్ నిర్ణయం

ప్రతిపక్ష టీడీపీ పై మరింత దూకుడుగా వ్యవహరించాలని జగన్ నిర్ణయం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిరోజు సభలో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిమీద ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అసలు దొరికిన చోటల్లా తిట్టిపోస్తున్నారు. ప్రతి చిన్నదానికి నానా రాద్ధాంతం చేస్తున్నారు. 23 ఎమ్మెల్యేలున్నా టిడిపి ఏమాత్రం తగ్గకుండా వైసీపీ పై ఎదురు దాడికి దిగుతుంది.
ఇక దీంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ పై మరింత దూకుడుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

 వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులకు తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలని ఆదేశం

వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులకు తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలని ఆదేశం


సభలో చర్చ జరుగుతున్న సమయంలో, టీడీపీ విమర్శలు చేస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తక్కువ సంఖ్యలో సభలో ఉండటం గమనించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేతల మాటల దాడిని జగన్ పార్టీ నేతలు గట్టిగా ఎదుర్కోవటం లేదని భావించిన ఆయన ఈరోజు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులకు తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలని కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం జగన్ ఆ బాధ్యతను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కి అప్పగించారు. వైసీపీకి చెందిన ప్రతి సభ్యుడు ఏ సమయానికి సభకు వస్తున్నారు. సభ నుంచి వెళ్లిపోతున్నారు అన్ని అంశాలను ప్రతిరోజు నమోదుచేసి తనకు నివేదిక అందజేయాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ విప్ కు ఆదేశాలు జారీ చేశారు.

జగన్ నిర్ణయంతో వైసీపీ మంత్రులకు , ఎమ్మెల్యేలకు షాక్

జగన్ నిర్ణయంతో వైసీపీ మంత్రులకు , ఎమ్మెల్యేలకు షాక్

ప్రతిరోజు సభ్యుల హాజరు పై తనకు ఏరోజుకారోజు నివేదిక అందించాలని ఆయన తెలిపారు. సభలో టీడీపీ బలం చాలా తక్కువగా ఉన్నప్పటికీ వారు వైసిపి ధాటిని ధీటుగానే ఎదుర్కొంటున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. మాటకు మాట సమాధానం చెప్తున్నారు. విమర్శలను ఖండిస్తున్నారు. ప్రతి విమర్శలు చేస్తున్నారు. దీంతో టిడిపి విమర్శలు చేస్తున్న సమయంలో వైసీపీ నేతలు ఉండటం లేదన్న విషయాన్ని గ్రహించిన జగన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అటెండెన్స్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్ నిర్ణయంతో ఏదో టైం పాస్ కి అసెంబ్లీ కి వస్తున్నాము అనుకునే మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెక్ పడే అవకాశముంది.
కాసేపు కూర్చుని మళ్ళీ బయటకు వెళ్లి షికార్లు చేసే ఎమ్మెల్యేలకు హాజరు తప్పని సరి కావటం కాస్త కష్టమే . కానీ స్కూల్ పిల్లల్లా హాజరేంటి అని అధికార పార్టీ నేతలు గుసగుసలాడుతున్నా సీఎం జగన్ నిర్ణయం కాబట్టి తప్పేలా లేదు.

English summary
During the debate on the AP Assembly, TDP criticized YCP MLAs and ministers in the House, Jagan took this decision as he found very less strength of YCP leaders in the assembly and felt that his party leaders were not resisting the verbal attacks of the TDP leaders, he made the key decision that the YCP MLAs should be given a mandatory attendance from today. CM Jagan handed over the responsibility to Chief Whip Srikanth Reddy. YS Jaganmohan Reddy has instructed the Chief Whip to report every day and report to him all the incidents that are going in the assembly. CM also said the Chief Whip to note down the in and out timings of the YCP leaders in the assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X