విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు అత్తపోరు ... ఏపీలో కొత్త చర్చ

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్తపోరు మొదలైంది. ఇది ఏపీ లో జరుగుతున్న సరికొత్త చర్చ. ఇంతకీ చంద్రబాబునాయుడికి తిప్పలు తెచ్చిపెట్టిన అత్త ఎవరు అంటే తెలుగు ప్రజలందరి నోట్లో నుంచి ఠక్కున వచ్చే మాట ఇంకెవరు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి. ఇంతకీ లక్ష్మీపార్వతి ఏం చేశారు? చంద్రబాబుకు ఇప్పుడు కొత్త టెన్షన్ పెడుతున్న అత్తపోరు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

తెలంగాణలో మరో ఆంధ్రా కేసు.. ! తనను వివాదాల్లోకి లాగిన కోటిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన లక్ష్మీపార్వతి తెలంగాణలో మరో ఆంధ్రా కేసు.. ! తనను వివాదాల్లోకి లాగిన కోటిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన లక్ష్మీపార్వతి

లక్ష్మీ పార్వతి 2005లోనే చంద్రబాబుపై అక్రమాస్తుల పిటీషన్

లక్ష్మీ పార్వతి 2005లోనే చంద్రబాబుపై అక్రమాస్తుల పిటీషన్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసిపి నాయకురాలు, ప్రస్తుత తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి మొదటి నుండి ఉప్పు నిప్పు లానే ఉన్నారు. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా చంద్రబాబు ను ఉతికారేసే లక్ష్మీపార్వతి 2005లో చేసిన పని ఇప్పుడు చంద్రబాబుకు చిక్కులు తెచ్చిపెట్టింది. దివంగత మాజీ సీఎం , టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి లక్ష్మీ పార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.

లక్ష్మీ పార్వతి పిటీషన్ పై విచారణ కొనసాగకుండా స్టే తెచ్చుకున్న బాబు

లక్ష్మీ పార్వతి పిటీషన్ పై విచారణ కొనసాగకుండా స్టే తెచ్చుకున్న బాబు

ఇక ఈ పిటిషన్ పై విచారణను ప్రారంభించకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడ్డాడు. పూర్తిస్థాయి విచారణ ప్రారంభించక ముందే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇక ఆ తర్వాత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబుకు అనుకూలంగా ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి పిటిషన్ పై విచారణను నిలుపుదల చేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది.

తాజాగా చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తుల పిటీషన్ విచారణకు కోర్టు ఆదేశం

తాజాగా చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తుల పిటీషన్ విచారణకు కోర్టు ఆదేశం

ఇక అప్పటి నుండి 14 ఏళ్ళ పాటు కొనసాగిన స్టే ఎత్తి వేస్తున్నట్టు తాజాగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ పై విచారణను ప్రారంభిస్తున్నట్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడ్డాడు. మొదటి నుండి అల్లుడు, అల్లుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన అత్త లక్ష్మీపార్వతి చేసిన పనికి ఇప్పుడు తల పట్టుకుంటున్నారు చంద్రబాబు.

ఎన్నికల అఫిడవిట్లు , పలు కీలక ఆస్తుల జాబితాతో లక్ష్మీ పార్వతి పిటీషన్

ఎన్నికల అఫిడవిట్లు , పలు కీలక ఆస్తుల జాబితాతో లక్ష్మీ పార్వతి పిటీషన్

ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు భిన్నమైన ఆస్తులు చూపించారని, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని లక్ష్మీపార్వతి ఇప్పటికే చంద్రబాబు టార్గెట్ గా పలుమార్లు విమర్శించారు. అంతేకాదు చంద్రబాబు తల్లికి హైదరాబాదులో ఐదెకరాల భూమి ఎలా వచ్చిందో చెప్పాలని కూడా లక్ష్మీపార్వతి తన పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశంలో లేరని ఆయన పై పోరాటం చేస్తానన్న లక్ష్మీపార్వతి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు సంబంధించి హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

ఈ నెల 25న కొనసాగనున్న విచారణ ... చంద్రబాబుకు షాక్ ఇచ్చిన అత్త

ఈ నెల 25న కొనసాగనున్న విచారణ ... చంద్రబాబుకు షాక్ ఇచ్చిన అత్త

ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ప్రక్రియ ప్రారంభిస్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయనున్నారు. ఈనెల 25 కి కేసును వాయిదా వేశారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంద్రబాబు జైలుకు వెళ్తాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారానికి దిగాయి. ఇప్పటికే టీడీపీ నేతలపై ఉన్న కేసులపై సతమతమవుతున్న చంద్రబాబుకు 2005లో అత్త లక్ష్మీపార్వతి వేసిన ప్రైవేట్ పిటిషన్ మరింత చిరాకు తెచ్చిపెడుతోంది.

అత్త లక్ష్మి పార్వతిని రకరకాలుగా బాధపెట్టిన అల్లుడు జైలుకే అంటున్న వైసీపీ శ్రేణులు

అత్త లక్ష్మి పార్వతిని రకరకాలుగా బాధపెట్టిన అల్లుడు జైలుకే అంటున్న వైసీపీ శ్రేణులు

చేసిన పాపం ఊరికే పోదు అని, అత్త లక్ష్మి పార్వతిని రకరకాలుగా బాధపెట్టిన అల్లుడు చంద్రబాబు జైలుకు వెళతాడని, తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరుతాడు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా నాటి నుండి నేటి వరకు అత్త లక్ష్మి పార్వతి అల్లుడు చంద్రబాబును టార్గెట్ అంటూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో తన వ్యాఖ్యలతో లక్ష్మీపార్వతి చంద్రబాబుని ఇరకాటంలో పెట్టారు.

Recommended Video

Chandrababu Naidu Calls Jagan 'Despot' After State Govt Scraps Amaravati 'Start-up Area Project'
అత్త ,అల్లుడు పంచాయితీపై సోషల్ మీడియాలో కొత్త చర్చ

అత్త ,అల్లుడు పంచాయితీపై సోషల్ మీడియాలో కొత్త చర్చ

అయితే గత ఎన్నికల ముందు లక్ష్మీపార్వతి పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి టిడిపి ఇరకాటంలో పెట్టాలని చూసిందని లక్ష్మీపార్వతి ఆవేదన చెందారు. ఇక తాజాగా సిబిఐ ప్రత్యేక కోర్టు చంద్రబాబు అక్రమాస్తుల పిటిషన్ ను విచారించడానికి నిర్ణయం తీసుకుని స్టే ఎత్తివేసిన నేపథ్యంలో ఏపీలో అత్తా అల్లుళ్ళ పంచాయతీ పై కొత్త చర్చ జరుగుతోంది. ఈ అవకాశాన్ని లక్ష్మీ పార్వతి ఏ మాత్రం వదులుకోరని అంటున్నారు.

English summary
YSR Congress leader, telugu academy chair person Lakshmi Parvathi's petition on Chandrababu's assets beyond 14-year stay removal was recently announced by the special court of the ACB. after the CBI Special Court ordered the trial of Laxmiparvati's petition. Chandrababu is now fell in tesion of the case and for the petition by Aunt Lakshmiparvati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X