విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Ayodhya Final verdict: రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు... ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన సుదీర్ఘకాలం కొనసాగిన అతి సున్నితమైన అయోధ్య వివాదం కేసులో సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో అయోధ్య కేసుపై తీర్పును వెలువరించింది. ఉత్కంఠభరితంగా సాగిన జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పులో ముందుగా... అయోధ్య భూమి విషయంలో రాజకీయాలు చరిత్రకు అతీతంగా తీర్పు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాల్నీ, నమ్మకాల్నీ సుప్రీంకోర్టు గౌరవిస్తుందని తెలిపారు.

Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపుAyodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు

బాబ్రీ మసీద్ నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవని, రామజన్మభూమి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది అయోధ్య వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మాణానికి ముందు ఒక నిర్మాణం ఉండేదని పేర్కొంది ఇక మొఘలుల కాలం నుండే బాబ్రీ మసీదు పై తమకు హక్కు ఉందని వక్ఫ్ బోర్డు నిరూపించలేక పోయిందని స్పష్టం చేసినా సుప్రీం ధర్మాసనం పురావస్తు శాఖ ఆధారాలను సమర్పించిన కారణంగా అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువుల దేనని పేర్కొంది. అయితే కొన్ని కండిషన్ లతో హిందువులకు అయోధ్య భూమి చెందుతుందని తీర్పులో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని, అలాగే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని ఐదెకరాల స్థలం సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని పేర్కొంది.

Ayodhya verdict... CM Jagan appeals during judgement

ఇక అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అయోధ్య నిర్మాణం విషయంలో సుప్రీం తీర్పు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలియజేసిన మీదటనే సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించినదని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ పోలీస్అధికారులను ఆదేశించారు.

English summary
AP CM YS Jaganmohan Reddy responded to the Supreme Court verdict on the disputed land in Ayodhya. The apex court said the verdict was issued only after both parties had agreed to abide by the Supreme Court ruling on the construction of Ayodhya. He urged all communities not to make any comments that would provoke religious harmony under such circumstances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X