• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో ‘బంట్రోతు’ వ్యాఖ్యల దుమారం .. బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి

|

ఏపీలో బంట్రోతు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎవరికి వారు బంట్రోతు వ్యాఖ్యలు చేస్తూ వాటికి కొత్త అర్ధాలు చెప్తున్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి బాలకృష్ణ బంట్రోతు వ్యాఖ్యలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలను ట్విట్టర్ వేదికగా ఎకిపారేస్తున్న విజయసాయిరెడ్డి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

జగన్ ప్రభుత్వానికి మొదటి సవాల్! ప్రభుత్వాసుపత్రుల్లో శిశువుల వరుస మరణాలు? ఆళ్లనాని ఇక్కడా..?

బాలయ్య బంట్రోతు వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్

బాలయ్య బంట్రోతు వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్

టీడీపీ అధినేతకు అచ్చెన్నాయుడు బంట్రోతు అన్న వ్యాఖ్యలపై బాలకృష్ణ అధికార పార్టీ నేతలు అయినా, ప్రతిపక్ష పార్టీ నేతలు అయినా ప్రజలకు బంట్రోతులేననీ, ప్రజా సేవకులేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక బాలయ్య వ్యాఖ్యలకు అవును టీడీపీ నేతలంతా నిజమైన బంట్రోతులను బంట్రోతు అనే పదానికి కొత్త అర్ధం చెప్పారు విజయసాయి రెడ్డి . టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని బంట్రోతు అని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి విమర్శించడంపై బాలయ్య స్పందనకు కౌంటర్ వేసిన విజయ సాయి టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ప్రజలకు బంట్రోతులేనని బాలయ్య భలే డైలాగ్ చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు అంతా బంత్రోతులే అంటూ ఏకిపారేసిన విజయ సాయి రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యేలు అంతా బంత్రోతులే అంటూ ఏకిపారేసిన విజయ సాయి రెడ్డి

ఇక గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలను ప్రస్తావిస్తూ మహిళా ఎమ్మార్వోను ఇసుకలో పడేసి కొట్టిన ఎమ్మెల్యే కూడా బంట్రోతేనని ఎద్దేవా చేశారు. ఇక ఆశా చెల్లెళ్లను బండబూతులు తిట్టిన వ్యక్తి కూడా సేవకుడనేనని విజయసాయి మండిపడ్డారు . ప్రజలను హింసించి వందలకోట్ల రూపాయలు ‘కె ట్యాక్స్' వసూలు చేసిన వారు స్పీకర్ గా చేసిన పెద్ద బంట్రోతు సంతానమే కదా! అని చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసి బంట్రోతు అన్న పదానికి కొత్త భాష్యం చెప్పారు . ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

చంద్రబాబు నాయుడ్ని ఎయిర్ పోర్ట్ లో తనిఖీ రాద్దాంతం పై ఘాటుగా స్పందించిన విజయ సాయి

చంద్రబాబు నాయుడ్ని ఎయిర్ పోర్ట్ లో తనిఖీ రాద్దాంతం పై ఘాటుగా స్పందించిన విజయ సాయి

గన్నవరం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని తనిఖీ చేయడంపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కూడా స్పందించిన ఆయన మీడియాలో వచ్చిన వార్తలపై , టీడీపీ నేతల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. "ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. ఆయన కాన్వాయ్‌కి ట్రాఫిక్‌ను ఆపడం లేదట. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట" అని ఆయన పేర్కొన్నారు ."ఒక బీసీ నాయకుడు స్పీకర్ అయితే గౌరవించాల్సిన అవసరం లేదనే మీ ఫిలాసఫీ అందరికీ తెల్సిందే చంద్రబాబూ గారూ. కిందటిసారి మీ కులపెద్ద సభాపతి అయితే తోడ్కొని వెళ్లారు. అప్పుడు మీరు పిలవకున్నా హుందాగా జగన్‌ గారు మీతో పాటు నడిచి ఆయనను అభినందించారు. మీకూ ఆయనకు తేడా అదే!" అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The YSRCP Rajya Sabha MP V Vijayasai Reddy once again slammed TDP Chief N Chandrababu Naidu and the yellow media through a Twitter post on Saturday. He condemned the allegations of the TDP leaders that their party president was no given VIP treatment and he was checked by the security personals at Gannavaram airport, and traffic is also not cleared to his convoy and also vijaya sai slammed on Bantrothu comments. he alleged that TDP MLAs in the past, the MLA who beat the female MRO in the sand, is called servant said. Vijayasai stressed that the man who had hit Asha sisters was also a servant. Those who have tortured people and made hundreds of crores of rupees as tax collectors are the big servants ..( Bantrotu) Vijayasayeddy tweeted to this extent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more