జగన్ గారూ 9ఏళ్లు రక్తాన్ని ఫణంగా పెట్టారు!దుర్మార్గుల చేతిలోకా?: పీవీపీపై బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్/అమరావతి: సినీ నిర్మాత, వైసీపీ ఎంపీ పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), మరో సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. టెంపర్ సినిమా ఫైనాన్స్ విషయంలో వీరి మధ్య వివాదంనెలకొంది.
తనను కిడ్నాప్ చేసి, హత్యచెయ్యాలని చూస్తున్నారని పీవీపీపై ఫిర్యాదు చేసిన బండ్ల.. ఇరువురిపై కేసులు

విజయవాడ ప్రజలు అదృష్టవంతులు..
ఈ నేపథ్యంలో పరోక్షంగా పీవీపీపై బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజలు ఎంత అదృష్టవంతులో నాకిప్పుడు అర్థమవుతుంది అమ్మో చిన్న పొరపాటు జరిగి ఉంటే ఘోరప్రమాదం జరిగిపోయేది' అంటూ పీవీపీపై సెటైర్లు వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి పీవీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గణేష్ పైవిధంగా స్పందించారు.

జగన్ గారూ 9ఏళ్లు రక్తాన్ని ఫణంగా పెట్టి..
‘తొమ్మిదేళ్ల పాటు తన రక్తాన్ని పణంగా పెట్టి, తమ చెమటను చిందించి, రాత్రి అనక పగలు అనక కుటుంబానికి దూరంగా గడిపి చేజిక్కించుకున్న అధికారాన్ని, @YSRCParty @AndharaCMO'.. '
కొందరు దుర్మార్గులకు పెత్తనాలు ఇచ్చి, మీ కీర్తిని పాడు చేసుకోవద్దని గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్ గారికి నా వినయపూర్వక విన్నపం.🙏🏻@YSRCParty @AndharaCMO' అంటూ బండ్ల వ్యాఖ్యానించారు.

భ్రష్టు పట్టించారంటూ..
‘డే కి వర్కింగ్ డేకి, కాల్ షీట్ కు, మామూలు షీట్ కు, మేకప్ కి ప్యాకప్ కి తేడా తెలియని కొందరు స్కామ్ రాజాలు ఇండస్ట్రీని భ్రష్టుపట్టించారు.@YSRCParty @AndharaCMO' అంటూ పీవీపీపై ధ్వజమెత్తారు బండ్ల.

ప్రతీ హీరోతోనూ గొడవలే..
‘తీసిన ప్రతి హీరోతో గొడవే. ప్రతి డైరక్టర్ తో పంచాయతీనే. ప్రతి నటుడితో గొడవలే.మాట్లాడితే కోర్టులు, కేసలుు. ఇండస్ట్రీ కి హిట్ లు, బ్లాక్ బస్టర్లు ఇవ్వడం తెలుసు కానీ కోర్టుల చుట్టూ తిరగడం కొత్తగా నేర్పాడు ఈ స్కామ్ రాజా.@YSRCParty. ప్రపంచం, భారతదేశం మొత్తం గర్వించదగ్గ నటుడు, పద్మశ్రీ కమల్ హాసన్ గారినే కోర్టుకు లాగిన నీచ చరిత్ర నీది.@YSRCParty' అంటూ బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బొక్కలో వేస్తారట అంటూ..
‘ప్రపంచంలో నేను ఏ దేశానికైనా హ్యాపీగా వెళ్లి తిరిగివస్తా. కొందరు స్కామ్ రాజాలు వేరే దేశాలకు వెళ్తే అరెస్టు చేసి బొక్కలో వేస్తారట. అందరూ చెప్పుకుంటుంటే విన్నా. నిజమో కాదో నాకు తెలియదు.@YSRCParty' అని నిర్మాత బండ్ల గణేష్ సెటైర్లు వేశారు.

డబ్బులు చెల్లించలేదంటూ పీవీపీ..
టెంపర్ సినిమా సమయంలో బండ్ల గణేష్ పీవీపీ నుంచి రూ. 30 కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి రూ. 23 కోట్లు పీవీపీకి చెల్లించారు బండ్ల గణేష్. అయితే మిగతా డబ్బు చెల్లించడం లేదని పీవీపీ ఆరోపిస్తున్నారు. మిగితా మొత్తం చెల్లించాలంటూ బండ్ల గణేష్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తనను బండ్ల గణేష్ అనుచరులు బెదిరింపులకు గురిచేశారంటూ పీవీపీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీవీపీ ఆరోపణలను ఖండించిన బండ్ల గణేష్.. పీవీపీ అదే పోలీస్ స్టేషన్లో పీవీపీపై ఫిర్యాదు చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!