విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాంక్‌‌లో సొమ్ములు పెట్టి హ్యాపీ అనుకుంటాం.. కాని లాకర్లో ఉండాల్సిన నగలు.. తాకట్టులో ఉన్నాయ్ జాగ్

|
Google Oneindia TeluguNews

బ్యాంకుల్లో మన సొమ్ముకు , మన నగలకు భద్రత ఉంటుందని భావిస్తాం. కానీ బ్యాంకుల్లో కూడా భద్రత లేదని తాజా ఉదంతాలు తెలియజేస్తున్నాయి. బ్యాంకుల్లో ఉన్న ఉద్యోగులే కేటుగాళ్ళ అవతారం ఎత్తితే , మన నగలను బయట తాకట్టు పెట్టుకుంటూ జల్సాలు చేస్తే బ్యాంకు ఉద్యోగుల లీలలతో బ్యాంకులపై నమ్మకం పోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది .

 టీడీపీలో అంతర్గత పోరు .. డొక్కా వర్సెస్ గల్లా .. బాబుకు అన్నీ కష్టాలే టీడీపీలో అంతర్గత పోరు .. డొక్కా వర్సెస్ గల్లా .. బాబుకు అన్నీ కష్టాలే

వ్యసనాలకు బానిసై బ్యాంకులో కస్టమర్ల నగలు బయట తాకట్టు పెడుతున్న ఉద్యోగి జైలు పాలు

వ్యసనాలకు బానిసై బ్యాంకులో కస్టమర్ల నగలు బయట తాకట్టు పెడుతున్న ఉద్యోగి జైలు పాలు

చెడు వ్యసనాలకు బానిసైన ఓ బ్యాంకు ఉద్యోగి చేసిన ఘనకార్యం వింటే మీరు కచ్చితంగా అవాక్కవుతారు. అసలేం జరిగిందంటే తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేసిన ఓ ఉద్యోగి ఏకంగా కస్టమర్ నగాలనే తాకట్టు పెట్టేశాడు . మంచిగా ఉంటూ మేనేజర్‌ను నమ్మించి ఖాతాదారులను వంచించాడు సదరు బ్యాంకు ఉద్యోగి . రూ.80 లక్షల విలువైన బంగారం, నగదు కాజేసిన బ్యాంకు ఉద్యోగి చివరకు కటకటాల పాలయ్యాడు.

 కస్టమర్ లాకర్ లో ఉన్న నగలు మాయం చేసి బయట తాకట్టు పెట్టిన ఉద్యోగి గుట్టు రట్టు

కస్టమర్ లాకర్ లో ఉన్న నగలు మాయం చేసి బయట తాకట్టు పెట్టిన ఉద్యోగి గుట్టు రట్టు

ఇక అసలు విషయానికి వస్తే విజయవాడకు చెందిన గొడవర్తి శ్రీనివాసరావు కంచికచర్ల మండలం పరిటాల ఎస్‌బీఐలో ఇన్‌చార్జి క్యాషియర్‌గా పనిచేస్తూ లాకర్‌లో పెట్టాల్సిన ఖాతాదారుల బంగారు ఆభరణాలను తన వద్ద ఉంచుకుని మరొకరి పేరుతో ఏపీకాబ్‌, ముత్తూట్‌ సంస్థల వద్ద, ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నాడు. ఇక అంతే కాదు మే 12న అప్పటి మేనేజర్‌ యోగిత నుంచి తీసుకున్న రూ.52 లక్షలు లాకర్‌లో పెట్టాడు. మరునాడు శ్రీనివాసరావు విధులకు రాకపోవడంతో మేనేజర్‌ నగదు లెక్కించగా, రూ.19 లక్షలు తగ్గాయి. వెంటనే ఆమె ఈ విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బ్యాంకు అంతర్గత విచారణకు ఆదేశించింది.

కేసు నమోదు .. 88 లక్షల రికవరీ

కేసు నమోదు .. 88 లక్షల రికవరీ

అనంతరం అంతర్గత విచారణలో నగదుతో పాటు బంగారం కూడా తాకట్టు పెడుతున్న వ్యవహారం వెలుగుచూసింది. ఈ సంఘటనతో మేనేజర్‌ యోగితను బదిలీ చేసి, ఇన్‌చార్జి క్యాషియర్‌ను అధికారులు సస్సెండ్‌ చేశారు. దీనిపై మే 29న మేనేజర్‌ గల్లా ఓం ప్రకాష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న శ్రీనివాసరావు ను అరెస్టు చేసి అతని నుంచి రూ.20.75 లక్షల నగదు, రూ.61 లక్షల విలువైన 2.200 కిలోల బంగారం, 6.25 లక్షల విలువైన ఒక కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . నిందితుడు బ్యాంకు నుంచి దుర్వినియోగం చేసిన మొత్తం 80.05 లక్షలు కాగా, అతని నుంచి రికవరీ చేసిన మొత్తం 88 లక్షలని తెలుస్తుంది. ఇక మరింత లోతుగా విచారణ చేసేందుకు సదరు కేటుగాడ్నిపోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు.

English summary
The cashier of the SBI’s branch at Paritala under Kanchikacherla police limits was arrested on Sunday for alleged misuse of the property mortgaged by customers.The accused, Srinivas Rao, allegedly took away gold jewellery of about 2 kg of various customers and fraudulently made money, according to SP M. Ravindranath Babu. The police recovered gold and cash worth about ₹88 lakh, the SP said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X