విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్దం: రుణం రూ 209 కోట్లు..35 కోట్ల ఆస్తులు:మాజీ మంత్రి ఉక్కిరి బిక్కిరి.

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి...టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. ఇండియన్ బ్యాంక్ కు ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణం తీసుకుని..తిరిగి చెల్లించకపోవటంతో బ్యాంకు నోటీసులు జారీ చేసింది. అయినా..ఇప్పటి వరకు రుణం రీ పేమెంట్ చేయలేదు. దీంతో..ఇచ్చిన గడువు ముగియటంతో డిసెంబర్ 20న గంటా ఆస్తులు వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది. గంటా బ్యాంకు నుండి చెల్లించాల్సిన మొత్తం రుణ బకాయిలు దాదాపు 209 కోట్లు గా చెబుతున్నారు. ఇందు కోసం మంత్రి బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తుల విలువ 35 కోట్ల 35 లక్షల 61 వేలు గా బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. దీంతో..మిగిలిన మొత్తం కోసం గంటా వ్యక్తిగత ఆస్తులు వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది.

రాం మాధవ్ తో గంటా భేటీ : బీజేపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి..!రాం మాధవ్ తో గంటా భేటీ : బీజేపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి..!

గంటా ఆస్తుల వేలం...

గంటా ఆస్తుల వేలం...

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులకు సంబంధించి ఇండియన్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. తమ బ్యాంకు నుండి రుణం రూపేనా గంటా తన సంస్థ ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర రూ 209 కోట్ల రుణం తీసుకున్నారు. అనేక సార్లు నోటీసులు ఇచ్చినా..పత్రికల ద్వారా వేలం ప్రకటనలు ఇచ్చినా ఇప్పటి వరకు తమకు చెల్లించాల్సిన బకాయిలు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో.. గంటా ఆస్తుల వేలం వేయాలని నిర్ణయించామన్నారు. అందు కోసం డిసెంబర్ 2న ముహూర్తంగా నిర్ణయించారు. అప్పటి లోగా గంటా తన బకాయిలు చెల్లించేందుకు ముందుకు వస్తే బ్యాంకు తమ నిర్ణయాన్ని ఉప సంహరించుకొనే అవకాశం ఉంది. అయితే, ఇందులో మరో ట్విస్ట్ ఉంది.

తనఖా పెట్టిన ఆస్తుల విలువ 35 కోట్లు

తనఖా పెట్టిన ఆస్తుల విలువ 35 కోట్లు

అయితే, ఇక్కడ బ్యాంకు రూ. 35 కోట్ల 35 లక్షల 61 వేల విలువైన ఆస్తులను తనఖా పెట్టుకొని బ్యాంకు ఏకంగా 209 కోట్ల రుణం ఎలా పొందారనేది..బ్యాంకు ఎలా ఇచ్చిందనేది ఇప్పుడు చర్చకు కారణమైంది. దీని కారణంగానే మిగతా బకాయిల కోసం గంటా వ్యక్తిగత ఆస్తిని వేలం వేసే అధికారం తమకు ఉందని ఇండియన్‌ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 444 గజాల్లో నిర్మించిన ప్లాట్‌ను వేలం వేయనున్నట్లు సమాచారం. గంటా ఆస్తుల వేలం పాటు అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని గంటాపై విమర్శలు వెల్లు వెత్తతున్నాయి. వీటి నుండి ఉపశమనం కోసమే గంటా ఇప్పుడు జాతీయ స్థాయిలో మద్దతు కోసం రాజకీయంగా పావులు కదుపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

వచ్చే నెల 20న వ్యక్తిగత ఆస్తులు వేలం..

వచ్చే నెల 20న వ్యక్తిగత ఆస్తులు వేలం..

దీంతో..గంటా నుండి బ్యాంకు తమకు రావాల్సిన బకాయిల వసూళ్ల కోసం గంటా శ్రీనివాసరావుకు చెందిన వ్యక్తిగత ఆస్తులను ఈ నెల 20న వేలం వేయాలని నిర్ణయించింది. బకాయిల చెల్లింపు కోసం అక్టోబర్‌ 4న బ్యాంకు అధికారులు డిమాండ్‌ నోటీసు కూడా పంపారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో.. గంటా ఆస్తుల పైన బ్యాంకు అధికారులు మరింతగా ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. గతంలో గంటా
ప్రభుత్వ భూములు తనఖా పెట్టి భారీ రుణాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు గంటా రాజకీయంగానూ ఇబ్బందుల్లో ఉన్నారు. టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినా..అక్కడ కొనసాగే అవకాశాలు కనిపించటం లేదు. ఇక, ఇప్పుడు ఆర్దిక పరమైన ఇబ్బందులు సైతం గంటాను వెంటాడుతున్నాయి. దీంతో..గంటా ఇప్పుడు ఎటువంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Ex minister Ganta srinivasa rao personal assests auction announcemnet gave by Indian bank. Ha has t repay his loan amount early rs 209 cr to bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X