విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతులు, డ్వాక్రా మహిళలకు తీపి కబురు: బ్యాంకర్లకు జగన్ హామీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఎస్ఎల్‌బీసీ సమావేశంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిచ్చే అంశంపై బ్యాంకు అధికారులతో చర్చించారు.

ఎలాంటి సాయం కోరినా..

ఎలాంటి సాయం కోరినా..

రైతులు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని ఈ సమావేశంలో సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో బ్యాంకర్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరినా చేస్తామని స్పష్టం చేశారు.

ఇంటికి వెళ్లి రశీదు..

ఇంటికి వెళ్లి రశీదు..

ఆర్థిక శాఖ అధికారులకు బ్యాంకర్లు అందుబాటులో ఉండాలని, వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికే చెల్లిస్తామని సీఎం తెలిపారు. వడ్డీ డబ్బులు చెల్లించాక గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సున్నా వడ్డీ చెల్లింపుల రశీదు అందజేస్తారని చెప్పారు. సున్నా వడ్డీల కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు చెల్లించాలో జాబితా ప్రభుత్వానికి అందజేయాలన్నారు.

ముద్ర రుణాలు కూడా..

ముద్ర రుణాలు కూడా..


ముద్ర పథకం కింద రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బళ్లపై చిరు వ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తామని అన్నారు.

రబీ రుణాలు..

రబీ రుణాలు..

వర్షాలు బాగా పడ్డాయని, రిజర్వాయర్లలో నీళ్లు కూడా బాగా ఉన్నందున రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఉందని.. ఆ మేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు జగన్. పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా రూ. 782 కోట్లు ప్రజా ధనాన్ని ఆదా చేశామని అన్నారు. రూ. 100 కోట్లు దాటిన ఏ టెండర్‌నైనా జడ్జి దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు.

English summary
Andhra Pradesh CM YS Jaganmohan Reddy has asked bankers to be liberal in extending loans to the farmers, women groups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X