• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శ్రీరెడ్డికి బెజవాడ రాజకీయాలు సూట్ అవుతాయన్న నెటిజన్లు: ఏపీ నేతల బూతుల ప్రభావంతో దిగజారిన రాజకీయాలు

|

ఏపీలో రాజకీయ నేతలు నోటికి పని చెప్పారు. లుచ్చా లు, వెదవలు, సన్నాసులు అంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. ఒకరిని మించి ఒకరు తమలో ఉన్న బూతు ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు నివ్వెరపోయేలా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పోశారు. ఇక ఇదే సమయంలో రాజకీయాల్లోకి వస్తానన్న శ్రీ రెడ్డికి ఏపీ రాజకీయాలు సరిగ్గా సరిపోతాయంటూ నెటిజన్లు సలహా ఇస్తున్నారు అంటే ఏపీ రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

నోటికి ఫిల్టర్ లేకుండా తిట్టుకుంటున్న రాజకీయ నేతలు

నోటికి ఫిల్టర్ లేకుండా తిట్టుకుంటున్న రాజకీయ నేతలు

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ రాజకీయాలపై హాట్ టాపిక్ నడుస్తుంది. గత నాలుగు రోజులుగా ఏపీ రాజకీయ నేతలు నిన్న మొన్నటివరకు టీడీపీలో కొనసాగిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నాని విచక్షణ మరిచి తిట్టిన తిట్లు అందరిని విస్మయానికి గురి చేశాయి. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను ఓ చర్చా కార్యక్రమంలో పబ్లిక్ గా తిట్టిన వంశీ ప్రారంభించిన బూతుపురాణం ఇప్పటికీ రాష్ట్రంలో కొనసాగుతుంది.

వంశీ ప్రారంభించిన బూతుల ప్రస్తానం

వంశీ ప్రారంభించిన బూతుల ప్రస్తానం

వల్లభనేని వంశీ ఎమ్మెల్సీ ఎలమంచిలి రాజేంద్రప్రసాద్ ను నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. చెత్త నా కొడకా.. చెప్పుతో కొడతా, డొక్క పగిలిద్ది, నోరు మూసుకో రా అంటూ మాటల్లో చెప్పలేనంతగా తిట్టిపోశారు. ఇక ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేసిన వల్లభనేని వంశీ పప్పును, వాడి బాబును ఇద్దరిని రమ్మను.. దేనికైనా రెడీ అంటూ ఇష్టారాజ్యంగా, ఫిల్టర్ లేకుండా మాట్లాడారు. చంద్రబాబు పెద్ద వెధవ, పెద్ద సన్నాసి అంటూ నోటికొచ్చింది తిట్టిపోశారు. వంశి వ్యాఖ్యలకే తెలుగు తమ్ముళ్లు షాక్ కు గురి అయితే ఆ తర్వాత కొడాలి నాని మరోమారు రంగంలోకి దిగారు.

మంత్రి కొడాలి నానీ సైతం అసభ్యకర పద ప్రయోగం

మంత్రి కొడాలి నానీ సైతం అసభ్యకర పద ప్రయోగం


వాడు వీడు ..... గాళ్లు, లుచ్చాలు , వాడి బాబు .. వాడి అబ్బ.. అంటూ పరుష పదజాలంతో దూషించారు. జగన్ జోలికి వస్తే చంద్రబాబుకు దేహశుద్ధి చేస్తామని హెచ్చరించారు. మంత్రి కొడాలి నాని సైతం తాను ఏపీకి మంత్రినన్న విచక్షణ మరచి టిడిపి నేతలను, అధినేత చంద్రబాబును నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. దీంతో ఏపీ రాజకీయ నాయకులు వాడుతున్న భాషపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.

రాజకీయాల్లోకి వస్తా అన్న శ్రీరెడ్డి ... షాక్ లో తెలుగు ప్రజలు

రాజకీయాల్లోకి వస్తా అన్న శ్రీరెడ్డి ... షాక్ లో తెలుగు ప్రజలు

ఇక ఇదే సమయంలో తనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదని అర్ధనగ్న ప్రదర్శన చేసి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన శ్రీ రెడ్డి రాజకీయాల్లోకి వస్తా అని ప్రకటించారు, దీంతో షాక్ తిన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెకు సూట్ అయ్యే స్టేట్ ఏపీ అని చెప్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలపై బూతు పురాణం మొదలుపెట్టిన శ్రీరెడ్డి ఇక తాజాగా తాను రాజకీయాల్లోకి వస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. శ్రీ రెడ్డి నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ ప్రతినిత్యం ఎవరో ఒక సినీనటుడు టార్గెట్ చేసి షాకింగ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న నానీపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.

ఏపీ రాజకీయాలకు సరిగ్గా సూట్ అవుతావని నెటిజన్ల సలహా

ఏపీ రాజకీయాలకు సరిగ్గా సూట్ అవుతావని నెటిజన్ల సలహా

ఇక ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి లాగా ఫిల్టర్ లేకుండా మాట్లాడే వారికి ఏపీ రాజకీయాలు సరిగ్గా సూట్ అవుతాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఏపీ రాజకీయాలు మరీ నీచంగా దిగజారిపోయిన నేపథ్యంలో శ్రీ రెడ్డి లాంటి వివాదాస్పద నటి రాజకీయాల్లోకి రావాలంటే ఏపీ నే కరెక్ట్ ప్లేస్ అని, విజయవాడ రాజకీయాలలోకి శ్రీరెడ్డి వెళ్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా ఏపీలో విజయవాడ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న కంపు, జరుగుతున్న రచ్చ రాజకీయాలను అప్రతిష్టపాలు చేస్తున్నాయని, రాజకీయ నాయకుల పై ప్రజల్లో తీవ్రమైన అసహనానికి కారణమవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. అందులో భాగమే శ్రీ రెడ్డిని ఏపీ రాజకీయాలలో కాలు పెట్టమని ఆహ్వానించటం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

English summary
Abusive language of Political leaders in the AP is hot topic now . One by one, they exhibited their abusive language and comments . The people of the Telugu states people making satires on abusive language of politicians . Netizens are advising that AP politics is the right place and especially vijyawada is fit for Sri Reddy who will be showing interest to enter into politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X