విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్సై వేధింపులు తాళలేక: విద్యార్థి బలవన్మరణం, వాయిస్ మేసేజ్ కూడా...

|
Google Oneindia TeluguNews

కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి చెరువులో విగతజీవై తేలడం కలకలం రేపుతోంది. అయితే స్థానిక ఎస్సై వేధింపుల వల్లే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు సదరు యువకుడు వాయిస్ మేసేజ్ చేయడంతో ఆత్మహత్య కీలక మలుపు తిరిగింది. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై మాత్రం స్పందించలేదు.

 చదువుకుంటూ టీ స్టాల్ నడిపితే..

చదువుకుంటూ టీ స్టాల్ నడిపితే..

గన్నవరంలో మురళి అనే విద్యార్థి డిగ్రీ ఫైనల్ ఈయర్ చదువుతున్నాడు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో.. టీ స్టాల్ పెట్టుకొని జీవిస్తున్నాడు. ఉదయం క్లాసులకు హాజరై.. రాత్రి పూట చిన్న హోటల్ నడుపుతున్నాడు. ఇల్లు గడవడంలో తల్లికి చేదోడు వాదోడుగా నిలిచాడు. కానీ సోమవారం విగతజీవై కనిపించడంతో అతని తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.

కారణమిదీ..

కారణమిదీ..

మురళి హోటల్ పెట్టిన ప్రాంతంపై వివాదం ఉంది. అయితే ఇటీవల గన్నవరం ఎస్సై నారాయణమ్మ భర్త, మరో టూ వీలర్ ఢీ కొట్టాయి. ప్రమాదంలో ఎస్సై భర్త గాయపడ్డారు. యాక్సిడెంట్‌కు కారణం అక్కడ మురళి హోటల్ ఉండటమేనని అనుకొన్నారు. టీ స్టాల్ లేకుంటే ప్రమాదం జరగదని భావించారు. ఇంకేముంది మురళిని స్టేషన్‌కు పిలిచి వేధించడం మొదలుపెట్టారు. వారికి మురళి కరెక్టుగా సమాధానం చెప్పిన వేధింపులు మాత్రం ఆపలేదు.

స్టేషన్‌కు పిలిచి..

స్టేషన్‌కు పిలిచి..

రోజు స్టేషన్‌కు పిలువడంతో మురళి ఇబ్బందికి గురయ్యాడు. తాను చేయని తప్పుకు వేధిస్తున్నారని బాధపడ్డాడు. తాను చదువుకుంటూ, టీ స్టాల్ నడుపుతుంటే హరాస్‌మెంట్ ఏంటీ అనుకొన్నాడు. ఇక ఈ జీవితం చాలు అని.. చావే పరిష్కారం అనుకొన్నాడు. సోమవారం గన్నవరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన ఆత్మహత్యకు గన్నవరం ఎస్సై నారాయణమ్మ కారణం అని వాయిస్ మేసేజ్ చేశాడు.

కఠినచర్యలు తీసుకొండి..

కఠినచర్యలు తీసుకొండి..


చేతికొచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళి చావుకు ఎస్సై కారణమని ఆరోపిస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కోరారు.

స్పందించని ఎస్సై

స్పందించని ఎస్సై

మురళి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మురళీ చావుకు ఎస్సై కారణమా ? గతంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు మురళి ఆత్మహత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై నారాయణమ్మ మాత్రం స్పందించలేదు. ఆమె స్పందిస్తే నిజనిజాలు తేలిసే అవకాశం ఉంది.

English summary
a women si harassed by student murali. student suicide on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X