విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనసేన, బీజేపీ జోడీ కూనిరాగాలు- ఓటమికి అప్పుడే సాకులు వెతుక్కుంటున్నారా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్ధానిక ఎన్నికల పోరులో ఆలస్యంగా దిగిన బీజేపీ-జనసేన కూటమికి అప్పుడే వైరాగ్యం మెదలైనట్లు కనిపిస్తోంది. ఓవైపు కూటమి నడుపుతూనే జిల్లాలలో విడివిడిగా పోటీ చేయడంతో పాటు పార్టీ అభ్యర్ధులకు సైతం నామినేషన్ల సమయంలో సహకరించని ఇరు పార్టీల నాయకత్వాలు ఇప్పుడు వైసీపీ తమ అభ్యర్ధులపై దాడులతో నామినేషన్లు అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే స్ధానిక పోరులో ఎదురయ్యే ఓటమికి ముందే సాకులు వెతుక్కుంటున్నట్లు ఇట్టే అర్ధమవుతోంది.

 బీజేపీ-జనసేన కూటమి ఉందా

బీజేపీ-జనసేన కూటమి ఉందా

ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా జత కట్టిన పాతమిత్రులు బీజేపీ-జనసేన ఏ రోజూ రాష్ట్రంలో ఉమ్మడి పోరాటాలకు పిలుపునివ్వడం కానీ, చేపట్టడం కానీ చేయలేదు. పేరుకు కూటమి కట్టినా అమరావతి ఆందోళనలు కానీ, ప్రీతి సుగాలి వ్యవహారం కానీ, ఇతర సమస్యలపైన కానీ ఎప్పుడూ ఇరు పార్టీలు కలిసి పని చేయలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో స్ధానిక ఎన్నికలు రావడం వీరికి ముుచ్చెమటలు పట్టిస్తోంది. పోటీ చేస్తే ఓ బాధ, పోటీ చేయకపోతే మరో బాధ.. అందుకే అయిష్టంగానే స్ధానిక పోరులో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన ఇరు పార్టీలు అందరి కంటే ఆలస్యంగా వ్యూహరచన మొదలుపెట్టాయి.

నామినేషన్లకు అభ్యర్ధులే లేరు

నామినేషన్లకు అభ్యర్ధులే లేరు


స్ధానిక పోరులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటితోనే ముగిసింది. అయినా జిల్లాల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్ధులే దొరకని పరిస్ధితుల్లో ఇరు పార్టీలు కూడా ఎవరు ముందుకొస్తే వారికి బీ ఫారాలు ఇచ్చి పంపించాయి. అయినా కూడా కనీసం 10 శాతం సీట్లలోనూ ఇరు పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు వేయలేదు. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ మధ్యలో బీజేపీ, జనసేన తరఫున పోటీ చేసేందుకు అభ్యర్ధులే లేని పరిస్దితి. నామినేషన్లకు అభ్యర్ధులే కరవైన పరిస్దితుల్లో ముందుకొచ్చిన వారికి కూడా సహకరించలేని ఇరుపార్టీలు.. ఇవాళ ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల పేరిట ఓ ప్రహసనానికి తెరదీశాయి.

వైసీపీ అడ్డుకుందని ఆరోపణలు

వైసీపీ అడ్డుకుందని ఆరోపణలు

స్ధానిక పోరులో భాగంగా పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్దులే కరవైన బీజేపీ-జనసేన కూటమి ఇవాళ చెబుతున్న కారణాలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. తమ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దీనికి బదులు అన్ని స్ధానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు వీలుగా ఓ ఆర్డినెన్స్ తెచ్చుకుంటే బావుండేదని పవన్ వ్యంగ వ్యాఖ్యానాలు చేశారు. ఏపీలో హింసాత్మక పరిస్ధితులు నెలకొన్నాయని, మరో బీహార్ లో రాష్ట్రాన్ని మార్చేస్తున్నారని మండిపడ్డారు.

 ఆడలేక మద్దెల ఓడు సామెతగా..

ఆడలేక మద్దెల ఓడు సామెతగా..

స్ధానిక ఎన్నికల పోరుకు ఓ మాత్రం సన్నద్దత లేకుండా ఇన్నాళ్లూ కాలం గడిపేసిన బీజేపీ-జనసేన కూటమికి ఎన్నికలు దగ్గరపడే సరికి వాస్తవాలు ఒక్కొక్కటిగా అర్ధమవుతున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లోనే రాష్ట్రంలో అన్ని స్ధానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులు కరవైన ఇరుపార్టీలు.. ఈసారి స్ధానిక పోరులోనూ ముందే చేతులెత్తేశాయి. కానీ తమ తప్పుల్ని కప్పేసుకునే క్రమంలో వైసీపీ దాడులను ప్రస్తావిస్తూ ఇలా అయితే ఎలా పోటీ చేస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నేతలు దాడులకు పాల్పడటం లేదని ఎవరూ చెప్పరు కానీ అదే కారణంతో తమ అభ్యర్ధులు నామినేషన్లు వేయలేదని, ప్రభుత్వం ఎన్నికలను ఏకపక్షం చేసుకుంటోందని చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.

English summary
BJP, JSP Coalition in Andhra Pradesh is now preparing for the local body election results. Today both parties leaders released their joint manifesto. after release jsp chief pawan says that despite the recent violance, govt might bring an ordinance and declare their win in local polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X