విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళ్ల వెంట రక్తం: పాస్టర్లకు జీతాలు అందుకే: చేవలేని, చేతగాని, చచ్చిపోయిన హిందూ సమాజం: యామిని

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో కొనసాగుతోన్న దేవాలయాలపై దాడులు, దేవతా మూర్తుల విధ్వంసాలపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు సాదినేని యామిని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం, విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని కోమాలమ్మ అమ్మవారి పాదముద్రలు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, తాజాగా విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహం ధ్వంసమైన ఘటనల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని ఆపడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ఆమె వరుస వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

హిందువులను నరికి పారేయండి: సాదినేని యామిని: ఏపీలో మరో రెండు విగ్రహాలు ధ్వంసంహిందువులను నరికి పారేయండి: సాదినేని యామిని: ఏపీలో మరో రెండు విగ్రహాలు ధ్వంసం

ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనా..?

ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనా..?

ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను మాత్రమే కాపాడటం మాత్రమే తమ బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరిస్తోండటం సరికాదని ఆమె అన్నారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత సైతం ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు. ఒకదాని వెంట ఒకటిగా చోటు చేసుకుంటోన్న ఈ దాడుల పట్ల హిందువులందరూ మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు. దాడులను నివారించడానికి హిందువుల జాగృతం కావల్సిన అవసరం వచ్చిందని, ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు.

అన్యమత సభలకు దేవాదాయ శాఖ మంత్రి..

అన్యమత సభలకు దేవాదాయ శాఖ మంత్రి..

హిందూ ఆలయాలకు రక్షణ కల్పించాల్సిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అన్యమత సభలకు వెళ్తుంటారని, హోం మంత్రి మేకతోటి సుచరిత ఒక మతానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం, ఎలాంటి చర్యలను తీసుకోకపోవడం వల్ల వాటిని ప్రోత్సహించినట్టవుతోందని విమర్శించారు. చేతగాని హోమ్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, డీజీపీ రాజీనామా చేయాలని సాదినేని యామిని డిమాండ్ చేశారు. దేవాదాయాల నుంచి వచ్చే ఆదాయం ద్వారానే మంత్రులు వేతనాలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.

హిందువులంతా చచ్చారనుకున్నారా?

హిందువులంతా చచ్చారనుకున్నారా?


తిరుమల, శ్రీశైలం, సింహాచలం వంటి అనేక ఆలయాల్లో వసతి గృహాలు, గోశాలలు, ప్రసాదాల తయారీ కాంట్రాక్ట్ వంటి పనులను అన్ని మతస్తులకు అప్పగిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఇది మరింత తీవ్రతరమైందని ఆమె ఆరోపించారు. ఇలాంటి చర్యల పట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు.. ఏపీలో హిందువులందరూ చచ్చిపోయారని అనుకుంటున్నారా? వాటిని అడ్డుకోలేరని ప్రభుత్వం భావిస్తోందా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల పట్ల వర్ణించలేని మానసిక క్షోభకు గురవుతున్నామని చెప్పారు.

రాజకీయ విగ్రహాల జోలికి వెళ్తే..

ఏదైనా ఒక రాజకీయ నాయకుడి విగ్రహం జోలికి వెళ్తే.. అట్టుడికిపోయే ఏపీలో దేవతా మూర్తుల విధ్వంసం కొనసాగుతున్నప్పటికీ.. ఎవరూ స్పందించట్లేదని, చేవలేని, చేతగాని, చచ్చిపోయిన హిందూ సమాజం ఏపీలో ఉందా అనే పరిస్థితులు దాపురించాయని అన్నారు. పాస్టర్లకు జీతాలు ఇస్తూ.. విగ్రహాలను ధ్వంసం చేసేలా ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఈ దారుణాలను చూసి భరించే ఓపిక హిందువులకు లేదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. విగ్రహాలను ధ్వంసం చేసే ముష్కరులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

English summary
BJP leader Sadineni Yamini slams AP Government for attacks on temple and idols vandalized. She said that We can't see the attacks on temples and idols everyday in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X