విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌ గూటికి వైసీపీ- జగన్ పాలన ఇందిర ఎమర్జెన్సీలాంటిదే- బీజేపీ నేత షాకింగ్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యవహారం మరో చిచ్చు రేపింది. స్లీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు పచ్చజెండా ఊపిన ప్రధాని మోడీపై విశాఖకు చెందిన వైసీపీ నేతలు రోజుకో రకంగా రెచ్చిపోతున్నారు. నేరుగా ప్రధానిపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇదే క్రమంలో సోనియానే ఎదిరించిన జగన్‌కు మోడీ ఓ లెక్కే కాదంటూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ కామెంట్లు కూడా చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్, అమర్నాథ్‌ చేసిన కామెంట్లపై బీజేపీ ఇవాళ సీరియస్‌గా స్పందించింది.

సీజేకు జగన్ లేఖపై సుప్రీం కీలక నిర్ణయం‌-అమరావతి భూముల స్కాంపైనా- మార్చి5 డెడ్‌లైన్సీజేకు జగన్ లేఖపై సుప్రీం కీలక నిర్ణయం‌-అమరావతి భూముల స్కాంపైనా- మార్చి5 డెడ్‌లైన్

మోడీపై వ్యాఖ్యలకు బీజేపీ ఘాటు కౌంటర్‌

మోడీపై వ్యాఖ్యలకు బీజేపీ ఘాటు కౌంటర్‌


కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలకు దిగుతున్న వైసీపీ నేతలకు బీజేపీ ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చింది. మోడీపై విమర్శలతో బీజేపీకి దూరమై తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరాలని వైసీపీ అనుకుంటోందా అన్న అర్ధం వచ్చేలా బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఏపీలో వైసీపీ పాలనను ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీ పరిస్దితులతో పోల్చారు. దీంతో ఇప్పుడు విష్ణు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

తిరిగి సొంత గూటికి జగన్‌ ?

తిరిగి సొంత గూటికి జగన్‌ ?


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై విమర్శలు ఎక్కుపెడుతున్న క్రమంలో మోడీ కంటే ఇందిరాగాంధీ వందరెట్లు బలమైన నాయకురాలు అంటూ వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. దీనిపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. భారత్‌కు ప్రధానులుగా పనిచేసిన వారిలో అత్యంత బలమైన నేతగా ప్రశంసలు అందుకుంటున్న మోడీపై వైసీపీ ఈ రకంగా విమర్శలు ఎక్కుపెట్టడం బీజేపీ నేతల్లో ఆగ్రహం కలిగిస్తోంది. అదీ కాంగ్రెస్‌ ప్రధాని ఇందిరాగాంధీతో మోడీని పోల్చడంపై వారు మండిపడుతున్నారు. ఇప్పుడు వైసీపీ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలతో ఆ పార్టీ బీజేపీకి దూరమై తిరిగి సొంతగూడు కాంగ్రెస్‌కు చేరుకుందా అని బీజేపీ నేత విష్ణు అనుమానాలు వ్యక్తం చేశారు. సొంతగూటికి చేరేందుకు వైసీపీ తాపత్రయం అంటూ విష్ణుచేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

జగన్‌ పాలనకు ఇందిర ఎమర్జెన్సీతో పోలిక

జగన్‌ పాలనకు ఇందిర ఎమర్జెన్సీతో పోలిక


ఇందిరాగాంధీ పేరెత్తితేనే మండిపడే బీజేపీ నేతలకు ఇప్పుడు వైసీపీ నేతల నోటి నుంచి ఆమెకు ప్రశంసలు రావడం మింగుడుపడటం లేదు. దీంతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని గుర్తుచేస్తూ వైసీపీ పాలనపై వారు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇందిరాగాంధీ అప్పట్లో ప్రత్యక్షంగా ఎమర్జెన్సీ విధించారని, ఇప్పుడు జగన్ పాలన పరోక్ష ఎమర్జెన్సీని తలపిస్తోందని బీజేపీ నేత విష్ణు ట్వీట్‌ చేశారు. అందుకే ఇందిరతో వైసీపీ నేతలు పోల్చుకుంటున్నారని విష్ణు మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌కు చురకలు అంటించారు.

అవంతి, అమర్నాథ్‌కు బీజేపీ వార్నింగ్‌


ప్రధాని మోడీ గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా మంత్రి అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ నేత విష్ణు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వారిద్దరూ నోటికొచ్చినట్లు విమర్శలు చేయడం సరికాదని విష్ణువర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. వైసీపీకి చెందిన ఒక్కో నేత రోజుకో రకంగా ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్నారని, రెండుసార్లు ఎన్డీయే చేతిలో ఓటమిపాలైన సోనియాగాంధీ మీకు గొప్ప నేతగా ఎలా కనిపిస్తున్నారని విష్ణు వైసీపీ నేతలను ప్రశ్నించారు.

English summary
andhra pradesh bjp general secretary vishnu vardhan reddy made sensational comments on jagan govt. he compares jagan govt's rule with past indira gandhi's emergency days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X