• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అంటున్న కన్నా సంచలన వ్యాఖ్యలు .. టీడీపీ ఖాళీయేనా !

|
  బిజెపి ప్రాధాన ప్రతిపక్షం : కన్నా |BJP Will Be The Main Opposition Party In AP : Kanna Laxminarayana

  ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారపక్షానికి, ప్రతిపక్షానికి మధ్య వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఒకరిమీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో దాడికి దిగుతున్నారు. అదే సమయంలో బిజెపి నేతలు సైతం మేమున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

  నారాలోకేష్ కు ఆ కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

  రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఉంటుందన్న కన్నా .. టీడీపీలో టెన్షన్

  రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఉంటుందన్న కన్నా .. టీడీపీలో టెన్షన్

  తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇకనుండి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఉంటుందని బాంబు పేల్చారు. కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలతో ఏపీలో చర్చ జరుగుతోంది.

  తెలుగు రాష్ట్రాల్లో బిజెపి బలోపేతం కావాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రామ్ మాధవ్ ను రంగంలోకి దింపింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారపార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బిజెపి ఎదగాలని భావిస్తోంది. అందుకే ప్రత్యర్థి పార్టీల లోని ముఖ్య నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఏపీలో టీడీపీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు, పలువురు కీలక నాయకులు సైతం కాషాయ కండువా కప్పుకున్నారు.

  బీజేపీలో చేరేందుకు అన్ని పార్టీలలోని నేతలు ఆసక్తి చూపుతున్నారన్న కన్నా

  బీజేపీలో చేరేందుకు అన్ని పార్టీలలోని నేతలు ఆసక్తి చూపుతున్నారన్న కన్నా

  ఇక తాజాగా కొంతమంది పార్టీ ముఖ్య నేతలు బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆషాడం తరువాత వారంతా కమలంలోకి చేరుతారని బిజెపి నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. పార్టీలో సభ్యత్వం పొందడం కోసం టిడిపి, వైసిపి, కాంగ్రెస్, జనసేన నాయకులందరూ ఆసక్తి చూపుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రధాన బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి తన స్థానాన్ని కోల్పోతుందని, బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా మారుతుందని కన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

  2024 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అని కన్నా జోస్యం

  2024 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అని కన్నా జోస్యం

  వైసిపి ప్రభుత్వం దూకుడు నిర్ణయాలు తీసుకుంటుందని, అలాంటి నిర్ణయాలవలన జగన్ రానున్న రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు చూడాల్సి ఉంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ పేర్కొన్నారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆ సమస్యలను అన్నింటిని పరిష్కరించడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషిస్తుందని కన్నా తెలిపారు. రానున్న 2024 ఎన్నికల్లో తప్పకుండ బీజేపీ ఏపీలో అధికారాన్ని దక్కించుకుంటుంది కన్నా లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJP state president Kanna Laxminarayana has been bombed as the main opposition in the state,There is debate in the AP with the comments of Kanna Lakshminarayana. The BJP is making efforts to strengthen the Telugu state. As part of that, Ram Madhav was put in the field. The BJP hopes to emerge as an alternative political party to the ruling party in the Telugu states.That is why the BJP is working out strategies to include the leaders of the opposition parties in their party. Already four members of the Rajya Sabha from the TDP in AP, along with several key leaders,joined in BJP .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more