విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బూతుల మంత్రి కొడాలి నాని, ఎప్పుడూ తాగి ఉండే ఎమ్మెల్యే జోగి రమేష్ .. బోండా ఉమా ధ్వజం

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలపై ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కలిసిన టిడిపి నేతలు వైసిపి నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నేత బొండా ఉమా బూతుల మంత్రి కొడాలి నాని, ఎప్పుడు తాగి ఉండే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ లు అంటూ వారు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 సీఎం జగన్ కనుసన్నల్లో బలవంతపు ఏకగ్రీవాలు , గ్రామాల్లో బెదిరింపుల పర్వాలు : దేవినేని ఉమ ఫైర్ సీఎం జగన్ కనుసన్నల్లో బలవంతపు ఏకగ్రీవాలు , గ్రామాల్లో బెదిరింపుల పర్వాలు : దేవినేని ఉమ ఫైర్

చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ప్రైవేట్ కేసులు పెడతాం

చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ప్రైవేట్ కేసులు పెడతాం

మున్సిపల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించే వారిపై, అధికారులపై ప్రైవేట్ కేసులు పెడతామని టిడిపి నేత బోండా ఉమ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని రికార్డు చేస్తున్నామని తెలిపారు. ఆయన వైసిపి ప్రభుత్వం ఉండేది కొద్ది రోజులేనని, అధికారులు వైసీపీ నేతలు చెప్పిన పనులు చేస్తే తర్వాత రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసిన అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అరాచకాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు .

కొడాలి నానీ , జోగి రమేష్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోండా ఉమ

కొడాలి నానీ , జోగి రమేష్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోండా ఉమ

అధికార వైసీపీకి రాజ్యాంగం, వ్యవస్థలపై గౌరవం లేదని, వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపికి ఓటు వెయ్యకుంటే పథకాలు రాకుండా చేస్తామని జోగి రమేష్ చెప్పడం, నిమ్మగడ్డ వస్తే ఏం పీకుతాడు అని మంత్రి కొడాలి నాని పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరమని బోండా ఉమ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను నిర్వహిస్తున్నారని చెప్పిన బోండా ఉమా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఎప్పుడూ తాగే ఉంటారని, మత్తులో జోగే మాట్లాడుతున్నారని జోగి రమేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 పంచాయతీ అక్రమాలపై రాష్ట్రపతికి, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేశాం

పంచాయతీ అక్రమాలపై రాష్ట్రపతికి, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేశాం

వైసిపికి ఓటు వేయకపోతే పథకాలు కట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇక వైసీపీ నేతల వ్యవహారం గవర్నర్ దృష్టిలో ఉందని పేర్కొన్న ఆయన ఏపీ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు అక్రమాలపై కేంద్ర హోం మంత్రి దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకు వెళ్ళామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వైసీపీ నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారని, ఇక విజయవాడలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని, పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బోండా ఉమ పేర్కొన్నారు.

 వైసిపి నేతలు బెదిరిస్తున్నారు, వారి ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారు

వైసిపి నేతలు బెదిరిస్తున్నారు, వారి ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారు

వైసిపి నేతల ఆదేశాలను పోలీసులు పాటిస్తూ, పోలీసులు టిడిపి నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా అభ్యర్థులపై బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆరోపించిన బోండా ఉమ, స్థానిక ఎన్నికల్లో 90% వైసీపీ గెలవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టారన్నారు. అందుకోసమే వైసీపీ నేతలు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అధికారులను సైతం బెదిరిస్తున్నారని బోండా ఉమ పేర్కొన్నారు.

English summary
TDP leaders, who met state election commissioner Nimmagadda Ramesh Kumar today, complained on YCP leaders about the irregularities in the state during the panchayat elections and the outrageous remarks being made by ministers and MLAs. On the occasion, TDP leader Bonda Uma incensed over the remarks made by Minister Kodali Nani and YCP MLA Jogi Ramesh, who is always drunk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X