విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డుకు అడ్డంగా 200 మంది వైసీపీ గూండాలు..40 ని. పాటు వెంబడించి..విధ్వంసం..:బోండా ఉమా, బుద్ధా

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో బుధవారం తెలుగుదేశం సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులు ప్రయాణిస్తోన్న కారుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాడి పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. ఇదే పరిస్థితి ఏర్పడుతుందని తాను ముందే హెచ్చరించానని అన్నారు. ప్రాణాలతో బయట తమ నాయకులు చేసిన అదృష్టమని వ్యాఖ్యానించారు.

బుద్ధా వెంకన్న..బోండా ఉమా కారుపై దాడి చేసిందివైసీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే: టీడీపీ ఫిర్యాదు.. !బుద్ధా వెంకన్న..బోండా ఉమా కారుపై దాడి చేసిందివైసీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే: టీడీపీ ఫిర్యాదు.. !

ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబును కలిసిన బుద్ధా, బోండా ఉమా


దాడి చోటు చేసుకున్న సుమారు అయిదు గంటల తరువాత బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావు గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లను కలిశారు. పంచుమర్తి అనురాధ, బాబూ రాజేంద్రప్రసాద్ తదితర నాయకులు అక్కడే ఉన్నారు. దాడిలో ధ్వంసమైన కారును చంద్రబాబు పరిశీలించారు. కారులో రాళ్లు, కర్రలు ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

200 మంది వైసీపీ గూండాలు వెంటపడ్డారు..

200 మంది వైసీపీ గూండాలు వెంటపడ్డారు..

దాడి చోటు చేసుకున్న విధానాన్ని వారు చంద్రబాబుకు వివరించారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమా తమ చేతికి తగిలిన గాయాలను చూపించారు. 200 మందికి పైగా వైసీపీ గూండాలు తమను వెంటపడ్డారని, కారుపై పెద్ద పెద్ రాళ్లు రువ్వారని అన్నారు. కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశారని చెప్పారు. కారు అద్దాలు పగిలి.. గాజు ముక్కలు గాయపరిచాయని బుద్ధా వెంకన్న చెప్పారు. మోచేయి, అరచేతులపై చోటు చేసుకున్న గాయాలు అయ్యాయని వివరించారు. దాడి సందర్భంగా వారు తీసిన వీడియోను సెల్‌ఫోన్ ద్వారా చంద్రబాబుకు చూపించారు.

Recommended Video

AP Local Body Election Nomination : టీడీపీ నేతలపై దాడి | కారు అద్దాలు ధ్వంసం..!! | Oneindia Telugu
 డీఎస్పీకి ఫోన్ చేసినా..

డీఎస్పీకి ఫోన్ చేసినా..

కారుపై దాడి చోటు చేసుకుంటున్న విషయాన్ని తాము మాచర్ల డీఎస్పీకి వివరించామని, అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని బోండా ఉమా తెలిపారు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. 40 నిమిషాల పాటు వారు విధ్వంసాన్ని సృష్టించారని చెప్పారు. తాము తప్పించుకుని పారిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆ సమయంలో తాము తీవ్ర భయాందోళనలకు గురయ్యామని, ప్రాణాలతో వస్తామని అనుకోలేదని అన్నారు. కారు ముందు సీట్లో కూర్చున్న పార్టీ న్యాయవాదికి తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు.

ఈ పరిస్థితి వస్తుందని ముందే చెప్పా..

ఈ పరిస్థితి వస్తుందని ముందే చెప్పా..

వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. ఈ పరిస్థితి తలెత్తుతుందని తనకు ముందే తెలుసునని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అధికారాన్ని చేపట్టిన తొమ్మిదినెలల వ్యవధిలోనే వైసీపీ ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే ఉద్దేశంతో అప్రజాస్వామికంగా తమ పార్టీ నాయకులపై దాడులకు దిగుతోందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని, రాక్షస పరిపాలనను కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు.

English summary
TDP leaders Bonda Umamaheswara Rao and Buddha Venkanna meets Party president Chandrababu at Party Office after attacked by allegedly YSR Congress Party workers near Macherla in Guntur district. Chandrababu Naidu observing the vehicle attacked by YCP activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X