విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఓ గురివింద, మరణానికి ముందు కోడెలను ఎన్నిసార్లు కలిశాడో చెప్పు: మంత్రి బొత్స ఫైర్

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. గతంలో గవర్నర్, సిబీఐ వ్యవస్థలను అనుమానించిన ఆయన ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సిబిఐ విచారణ డిమాండ్ చేసే ముందు సెల్‌ఫోన్ ఎక్కడ పోయిందని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఫోన్‌ను ఎవ్వరు దాచారు..? ఫోన్ ఎక్కడ ఉంది...? దీనిపై ఎందుకు చంద్రబాబు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గత మూడు నెలల్లో కోడెలతో ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు కలిశారని బోత్స ప్రశ్నించారు. ఇంకా బొత్స ఏమని దుయ్యబట్టారంటే..

 గవర్నర్ వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లావు

గవర్నర్ వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లావు

గవర్నర్‌ను పనికిమాలిన వ్యవస్థగా అభివర్ణించిన చంద్రబాబు ఆయనను ఎందుకు కలిశారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గవర్నర్ కేంద్రానికి ఒక ఏజెంట్‌గా పని చేశాడని, గవర్నర్ వ్యవస్థ పనికిమాలిన వ్యవస్థగా చంద్రబాబు అభివర్ణించారు. అలాంటీ పనికి మాలిని వ్యవస్థగా అభివర్ణించిన వ్యక్తిని ఏ ముఖం పెట్టుకుని వెళ్లారని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకుని టీడీపీ నాయకులను భయాందోళనకు గురి చేస్తోందని పేర్కొంటూ ఈ పరిణామాలే కోడెల ఆత్మహత్యకు దారి తీశాయని పేర్కోంటూ 13 పేజీల లేఖను పార్టీ నేతలతో కలిసి గవర్నర్‌కు అందించారు.

రాష్ట్రంలో సిబీఐని వ్యతిరేకించింది ఎవరు

రాష్ట్రంలో సిబీఐని వ్యతిరేకించింది ఎవరు

ఇక కోడెల విషయంలో కూడ సిబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన చంద్రబాబు నాయుడు గతంలో సిబిఐ వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేశారన్నారు.. అయిదు సంవత్సరాల్లో చట్టాలపై ఎలాంటి గౌరవం లేకుండా వ్యవహరించారని బోత్స విమర్శించారు. వారు చెప్పిందే వేదంగా ప్రభుత్వ వ్యవస్థలు మారాయని ఫైర్ అయ్యారు... ఇందులో భాగంగానే వ్యవస్థలన్నింటిని చిన్నాభిన్నం చేశారని దుయ్యబట్టారు..

మూడు నెలల్లో ఎన్నిసార్లు కోడెలను కలిశావు

మూడు నెలల్లో ఎన్నిసార్లు కోడెలను కలిశావు


ఇక కొడెల ఆత్మహత్యను ఒక సినిమాలాగా చంద్రబాబు తీసుకువచ్చాడని మండిపడ్డారు. కోడెల మృతి పూర్వాపరాలు తీసుకుంటే గత మూడు నెలలుగా శివప్రసాద్, ఎన్నిసార్లు చంద్రబాబును కలిశారో ఆలోచన చేయండి అన్నారు. ఒక పార్టీకి ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న కోడెలను ఎన్నిసార్లు, ఏయో అంశాలపై కలిశారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే కోడెల బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసేందుకు ప్రాధేయపడ్డారని అన్నారు.

కోడెలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదు

కోడెలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదు


ఇక పైరవీలకు తప్ప పార్టీలో పనిచేసే వ్యక్తులకు స్థానం లేదనడం వాస్తవం కాదా బొత్స ప్రశ్నించారు. కోడెల మీద ఉద్యోగాలు, ఆక్రమణల ఫిర్యాదులు ప్రజలు ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఎప్పుడైనా ఆరోపణలను ఎందుకు ఖండించలేదని అన్నారు. కనీసం ఆరోపణలపై ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. భాదితులు కేసులు పెడుతున్నప్పుడు అవన్ని వాస్తవమే అని నమ్మి, ఇప్పుడు సినిమా చేస్తున్నారని దుయ్యాబట్టారు. పార్టీ పట్టించుకోవడం వల్లే కోడెల దుస్ధితి కారణమని అన్నారు.

చట్టాలను ఉల్లంఘించిన వాళ్లు కబుర్లు చెబుతున్నారు

చట్టాలను ఉల్లంఘించిన వాళ్లు కబుర్లు చెబుతున్నారు

ఇవన్ని మరిచిపోయిన చంద్రబాబు గురివింద గింజలాగ మాట్లాడతున్నారని అన్నారు. ఇక మీడియాను అంతా గుప్పిట్లో పెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడిన అంశాలు ఒక్కసారి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. టీడీపీ చేసిన అరాచాలకు విసిగి పోయిన ప్రజలు ఎన్నికల్లో ఘోరమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ఐదు సంవత్సరాల్లో అనేక చట్టాలను తుంగలో తొక్కిన వారు ఇప్పుటు చట్టాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.

English summary
AP municipal minister Botsa sathyanarayana criticised the TDP chief Chandrababu Naidu on kodela issue,he asked that why chandrababu naidu met governer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X