విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఆర్డీఏ బిల్లు రద్దు ఎందుకంటే?: అసెంబ్లీలో మంత్రి బొత్స, రాజధాని రైతులకు వరాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఆర్డీఏను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడించారు. ప్రాంతీయ అసమానతల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని.. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజధాని కోసం సీఆర్డీఏ చట్టం తీసుకొచ్చారని తెలిపారు.

చంద్రబాబు-పరిటాల సునీత, లోకేష్..: అసెంబ్లీలో అమరావతి భూముల చిట్టా విప్పిన మంత్రి బుగ్గనచంద్రబాబు-పరిటాల సునీత, లోకేష్..: అసెంబ్లీలో అమరావతి భూముల చిట్టా విప్పిన మంత్రి బుగ్గన

గత పాలకుల నిర్లక్ష్యం..

గత పాలకుల నిర్లక్ష్యం..


గత పాలకులు అసమానతలను తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని, మళ్లీ ఒకే ప్రాంతంలో పరిపాలన కేంద్రీకరిస్తూ.. ఇతర ప్రాంతాలవారి అవసరాలు, మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బేరీజు వేసుకోకుండా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు.

13 జిల్లాల అభివృద్ధి కోసమే సీఆర్డీఏ రద్దు..

13 జిల్లాల అభివృద్ధి కోసమే సీఆర్డీఏ రద్దు..

రాష్ట్ర రాజధానిపై శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను అప్పటి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఆ రోజు సభలో బలముందని ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలా కాకుండా.. 13 జిల్లాల అభివృద్ధి, 5 కోట్ల మంది అభివృద్ధి చెందాలని తాము సీఆర్డీఏ రద్దు బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి బొత్స వెల్లడించారు.

సమగ్ర అభివృద్ధి కోసమే హైపవర్ కమిటీ సిఫార్సులు..

సమగ్ర అభివృద్ధి కోసమే హైపవర్ కమిటీ సిఫార్సులు..

బోస్టన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలపై హైపవర్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని మంత్రి బొత్స తెలిపారు. అన్ని ప్రాంతాల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా.. కమిటీ కొన్ని సూచనలను ప్రభుత్వానికి చేసిందని చెప్పారు. సమతుల అభివృద్ధితోపాటు పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కమిటీ పేర్కొందని వెల్లడించారు. పరిమితమైన వనరులు, ఆర్థిక పరమైన ఒత్తిడుల నేపథ్యంలో.. అభివృద్ధి వికేంద్రకరించి 13 జిల్లాలకు వాటి ఫలాలను అందించాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించిందని తెలిపారు.

రాజధాని రైతులకు వరాలు..

రాజధాని రైతులకు వరాలు..

గత ప్రభుత్వం కంటే మిన్నగా రాజధాని గ్రామాలకు మేలు చేస్తామని తెలిపారు. రాజధాని గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పింఛనును రూ. 2500 నుంచి రూ. 5వేలకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన అసైన్డ్ దారులకు రిటర్న్ ఫ్లాట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు గతంలో జరీబుకైతే రూ. 50 వేలు, మెట్ట భూమికి అయితే రూ. 30 వేలు 10 ఏళ్లకు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని మంత్రి తెలిపారు. అలాగే ప్రతి ఏటా ప్రతి ఏటా జరీబుకు రూ. 5వేలు, మెట్టభూమికి రూ. 3వేలు పెంచాలని గతంలో నిర్ణయించారని, ఈ యాన్యునిటీని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతూ నిర్ణయించామన్నారు. 10 ఏళ్ల తర్వాత జరీబు భూమికి ఇచ్చే యాన్యునిటీ రూ. 1 లక్ష రూపాయలు, మెట్ట భూమికి రూ. 60 వేలు అవుతుందన్నారు. ఇప్పుడు ఒప్పందం ఉన్న 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐదేళ్లపాటు కూడా ఇదే రీతిలో యాన్యునిటీని చెల్లిస్తామని వివరించారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై బొత్స ఫైర్..

చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై బొత్స ఫైర్..

తమ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తోందని అన్నారు. మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ కోసమేనని, రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధి కోసమేనని అన్నారు. విశాఖ రాజధాని ఎవరు కావాలని చంద్రబాబు అడుగుతున్నారని.. తాను అడుగుతున్నానని బొత్స తెలిపారు. కాగా, సభలోని కొందరు సభ్యులు తమ జిల్లానే రాజధాని చేయాలంటూ కేకలు వేశారు. గతంలో రాష్ట్ర విభజనకు అనుకూలమని చెప్పి.. ఇప్పుడు కూడా చంద్రబాబు అలాంటి పరిస్థితే తీసుకొచ్చారని మంత్రి బొత్స అన్నారు. అచ్చన్నాయుడుకు బాడీ పెరిగింది కానీ, బ్రెయిన్ పెరగలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 13 జిల్లాల అభివృద్ధి, సుఖసంతోషాలతో ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు. అమరావతి రైతులను కూడా ఆదుకుంటామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా స్పకర్, చంద్రబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చంద్రబాబుపై బొత్స మండిపడ్డారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
Andhra Pradesh minister botsa satyanarayana on 3 capital cities and crda bill
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X