నదీ విహారం లేకుండానే దుర్గమ్మ తెప్పోత్సవం... కృష్ణమ్మ చెంత పూజలు యధాతధం
ఏపీలోని బెజవాడలో కొలువైన కనకదుర్గమ్మ తెప్పోత్సవ నిర్వహణకు బ్రేక్ పడింది . కృష్ణమ్మ ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా దుర్గమ్మ నదీ విహారానికి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో రేపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంతో ఘనంగా జరగాల్సిన కనకదుర్గ తెప్పోత్సవం నదీవిహారం లేకుండానే నిర్వహించనున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది తెప్పోత్సవానికి ఆటంకం కలిగినట్లుగా అధికారులు చెబుతున్నారు.
దుర్గమ్మ తెప్పోత్సవంపై సందిగ్ధం ... కృష్ణమ్మ ఉధృతి నేపధ్యంలో డైలమా

ఉత్సవమూర్తులను హంసవాహనం పై ఉంచి మూడు సార్లు ముందుకు వెనక్కు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం దుర్గా మల్లేశ్వర స్వాములు నదీ విహారం చేసే తెప్పోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారుల భావించినా , ఎగువ నుండి వస్తున్న వరదనీరు కారణంగా తెప్పోత్సవం నిర్వహణపై అధికారులు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవమూర్తులను హంసవాహనం పై ఉంచి మూడు సార్లు ముందుకు వెనక్కు అక్కడే తిప్పి, నదీ విహారం పూర్తి చేయనున్నారు.

నదిలో విహారం లేకుండానే దుర్గా మల్లేశ్వర స్వామి తెప్పోత్సవం
అనాదిగా వస్తున్న ఆనవాయితీ అయిన దుర్గమ్మ తెప్పోత్సవం నిర్వహించే వెసులుబాటు లేని కారణంగా, ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో 2004లో కూడా కృష్ణమ్మకు వరదలు ముంచెత్తడంతో ఇదే తరహాలో తెప్పోత్సవం నిర్వహించినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.
నదిలో విహారం లేకుండానే దుర్గా మల్లేశ్వర స్వామి తెప్పోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ఆలయ అధికారులు చెబుతున్నారు.

తెప్పోత్సవ నిర్వహణ సమయంలో కనకదుర్గ ఫ్లైఓవర్ పై రాకపోకల నిలిపివేత
కృష్ణానదిలో దుర్గా మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు యధాతథంగా పూజలు నిర్వహిస్తామని, కరోనా నేపధ్యంలో పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత హంసవాహనంపై స్వామి వారిని అమ్మవారిని ఉంచి ముందుకు వెనుకకు మూడుసార్లు తిప్పి తెప్పోత్సవ కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్తున్నారు. ఇక తెప్పోత్సవం జరుగుతున్నంతసేపు కనకదుర్గ ఫ్లైఓవర్ పై వాహనాలు, భక్తుల రాకపోకలు నిలిపివేస్తామని తెలిపారు. ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కో-ఆర్డినేషన్